Congress Politics: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయిన తరువాత కాంగ్రెస్ లో మార్పు వచ్చిందా..? పార్టీని పటిష్ట పరచడానికి రేవంత్ చేస్తున్న కృషి ఫలించడం లేదా..? సీనియర్ నేతలు చల్లబడ్డారా..? వారేమంటున్నారు..? ఏం చేయబోతున్నారు..? హుజూరాబాద్ ఉపఎన్నిక తరువాత కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అంతర్ కలహాలు మొదలయ్యాయి. ఓ వైపు హుజూరాబాద్ ఫలితం వెలువడుతుండగానే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ తోనే హుజూరాబాద్ లో కాంగ్రెస్ పరువు పోయిందని, పార్టీని ఇంత దిగజార్చిన రేవంత్ పై చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నాయకులే ఫైర్ అవుతున్నారు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి శిక్షణ తరగలతు పేరిట కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నెలకొల్పేందుకు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయా..?
వందేళ్ల కాంగ్రెస్(Congress Politics) పార్టీ ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చింది. అయితే పార్టీలో అసమ్మతిని మాత్రం చల్లార్చడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్నకాంగ్రెస్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పటి నుంచో సీనియర్లు వర్సెస్ జూనియర్లు అన్న మాదిరిగా ఉంది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్లకి.. కొత్తగా చేరిన వారిని నిత్యం అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏడేళ్లుగా కాంగ్రెస్ దిగజారుతూ వస్తోంది. అయితే యూత్ ఫాలోయింగ్ తో పాటు దూకుడు స్వభావం ఉన్న రేవంత్ రెడ్డిని నియమిస్తే పార్టీకి లాభం జరగుతుందని అధిష్టానం భావించింది. దీంతో ఆయనను పార్టీకి అధ్యక్షుడిని చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాల్ గా మారింది. అయితే ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రమాణికం కాదని రేవంత్ రెడ్డి ముందే చెప్పారు. అయినా అభ్యర్థి కోసం తీవ్ర కృషి చేశారు. ఒక దశలో కొందరు పోటీకి నిలబడలేనని తెగేసి చెప్పారు. దీంతో విద్యార్థి సంఘం నాయకుడు బల్మూరి వెంకటేశ్ ను బరిలోకి దింపారు. అయితే అభ్యర్థిని ఎంపిక చేయడంతో పాటు ప్రచారంలోనూ కాంగ్రెస్ చాల వెనకబడింది. మరోవైపు ఇక్కడ ఈటల రాజేందర్ హవా సాగుతుండడంతో కాంగ్రెస్ ను ఎవరూ పట్టించుకోలేదు.
ఫలితంగా హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి గెలుపోందారు. గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి పోటి చేయగా 60 వేల ఓట్లు సాధించారు. అయితేకౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లడంతో కాంగ్రెస్ కు అభ్యర్థి కరువయ్యారు. దీంతో కాంగ్రెస్ కు ఎంతో కొంత సాంప్రదాయ ఓటు ఉంటుందని భావించారు. కానీ కనీసం డిపాజిట్ ఓట్లు కూడా రాకపోవడంతో కాంగ్రెస్ ఇక బతికి బట్టకట్టదని కొందరు విమర్శలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయని, ఇందుకు రేవంత్ రెడ్డి యే కారణమని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు.
దీంతో ఓ సీనియర్ నేత రేవంత్ రెడ్డి చర్యలపై కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారట. ఇక రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకు మాణిక్కం ఠాగూర్ సైతం సమర్థిస్తున్నారు. దీంతో ఇరువురు పార్టీకి తీవ్ర నష్టం చేయడానికి అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేసేందుకు ఆ సీనియర్ నేత త్వరలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడట.
అయితే ఓవైపు పార్టీని అభివృద్ధి చేయడానికి రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటే..సీనియర్లు మాత్రం ఆయనపై గుర్రుగా ఉన్నారని అంటున్నారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాత వెంటనే రేవంత్ రెడ్డి సీనియర్లను కలుస్తూ వచ్చారు. దీంతో అసమ్మతి రాగాన్ని తగ్గించారని ప్రచారం జరిగింది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికతో మళ్లీ మొదటికొచ్చిందని చర్చించుకుంటున్నారు.
Also Read: రేవంత్ రెడ్డి ప్లాన్ బెడిసికొట్టిందా..? ప్రయత్నాలు వృథానేనా..?