https://oktelugu.com/

God Father: మెగాస్టార్​తో స్టెప్పులేయనున్న సల్మాన్​ భాయ్​

God Father: సైరా నరసింహా రెడ్డి విజయంతో వరుస ప్రాజెక్టులతో ఫుల్​ బిజీగా ఉన్నారు మెగాస్టార్​ చిరంజీవి. ఇటీవల ఆచార్య సినిమా షూటింగ్​ పూర్తి చేసుకున్న చిరు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమాతో ప్రేక్షకుల మందుకు రానున్నారు. మరోవైపు, భోళాశంకర్​ సినిమాకు ఒప్పుకున్నారు. కాగా, బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీంతోపాటు, గాడ్​ఫాదర్​ సినమా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్​ స్టార్​ సల్మాన్​ఖాన్​ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 12, 2021 / 11:01 AM IST
    Follow us on

    God Father: సైరా నరసింహా రెడ్డి విజయంతో వరుస ప్రాజెక్టులతో ఫుల్​ బిజీగా ఉన్నారు మెగాస్టార్​ చిరంజీవి. ఇటీవల ఆచార్య సినిమా షూటింగ్​ పూర్తి చేసుకున్న చిరు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమాతో ప్రేక్షకుల మందుకు రానున్నారు. మరోవైపు, భోళాశంకర్​ సినిమాకు ఒప్పుకున్నారు. కాగా, బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీంతోపాటు, గాడ్​ఫాదర్​ సినమా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్​ స్టార్​ సల్మాన్​ఖాన్​ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. దీంతో పాటు, హాలీవుడ్​ స్టార్​ సింగర్​ బ్రిట్నీ స్పియర్స్​ ఓ పాట పాడతారంటూ సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. సల్మాన్​ నటిస్తోన్న విషయంపై చిత్ర సంగీత దర్శకుడు తమన్​ స్పందించారు. గాడ్​ఫాదర్​లో సల్మాన్​ భాయ్​ నటిస్తున్న వార్త నిజమేనని స్పష్టం చేశారు.

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్​.. చిరు, సల్మాన్​ కలిసి డాన్స్ చేయడం చాలా పెద్దవిషయం. అందుకే ఈ పాట కూడా అదే రేంజ్​లో ఉండాలి. అందుకే కొన్ని ప్రముఖ ఆడియో కంపెనీలతో మాట్లాడుతున్నాం. వాళ్లు అంతర్జాతీయ స్థాయి ఆడియో కంపెనీలతో మాట్లాడాలి. అంటూ తెలిపారు.

    ప్రస్తుతం బ్రిట్నీని సంప్రదించే ముందు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే, వారితో తెలుగు పాట పాడించాలా, లేదా, ఇంగ్లీష్​లో పాడించాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు. మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్‌ ఫాదర్‌ సినిమా..  మలయాళ ‘లూసిఫర్‌’కి రీమేక్‌గా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.