ఏపీలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు జగన్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సీఎం జగన్ కు అపకీర్తి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీజేపీ, టీడీపీలు జగన్ తీరు వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మీడియాలోనూ హైలెట్ అవుతోంది.
ఈ క్రమంలోనే సీఎం జగన్ కు మద్దతుగా ముందుకొచ్చారు సీనియర్ హీరో సుమన్. ఏపీలోని ఆలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సీఎం జగన్ కు సుమన్ అండగా నిలిచారు.
తిరుమలలో జరిగిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమార్తె వివాహానికి హాజరైన సుమన్ మాట్లాడుతూ ఆలయాలపై దాడుల నేపథ్యంలో ప్రతీ ఆలయం వద్ద సీసీ కెమెరాలు, భద్రత ఏర్పాట్లు చేయాలని కోరారు. దేవుడి విషయంలో రాజకీయాలు తగదన్నారు. దేవుడిపై ఎవరు ఎలాంటి తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని సుమన్ హెచ్చరించారు.
సీఎం జగన్ కు చెడ్డపేరు తేవడానికే ఆలయాలపై కొన్ని దుష్టశక్తులు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నాయని సుమన్ విమర్శించాడు. రోడ్డుపై ధర్నాలు చేసే బదులు.. ఆలయాల వద్ద నిఘా పెంచాలని సుమన్ కోరారు.