Kolkata Trainee Doctor Case : ఆర్ జి కర్ ఆస్పత్రిలో జరిగిన దారుణానికి సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలని జూనియర్ వైద్యులు ఇప్పటికే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కు సంబంధించిన వార్తలు దేశవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతున్నాయి. దీంతో సోషల్ మీడియా నుంచి మొదలుపెడితే మీడియా వరకు ఈ విషయం చర్చల్లో ఉంటున్నది. ఫలితంగా ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలో ఆర్జీ ఆస్పత్రి తో సహా పలు ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన దాదాపు 200 మందికి పైగా సీనియర్ వైద్యులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ముకుమ్మడిగా రాజీనామాలు చేశారు. మరో 77 మంది వైద్యులు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. కోల్ కతా లోని కళ్యాణి జేఎన్ఎం ఆసుపత్రికి చెందిన 77 మంది వైద్యులు వెస్ట్ బెంగాల్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు ఈ మెయిల్ పంపించారు. అందులో రాజీనామా విషయాన్ని ప్రకటించారు. అక్టోబర్ 14 వరకు గడువు ఇస్తున్నామని.. ఈలోగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే విధులకు రాబోమని హెచ్చరించారు..” జూనియర్ వైద్యులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని” ఆ వైద్యులు రిజిస్ట్రార్ కు పంపిన మెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ” మేము పనిచేస్తున్న చోట మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పని చేయలేకపోతున్నాం. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. జూనియర్ వైద్యుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపించడం లేదు. హత్యాచారానికి గురైన వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలి. ఆరోగ్య కార్యదర్శి ఎన్. ఎస్ నిగం ను విధుల నుంచి తొలగించాలి. పని చేసే చోట భద్రత చర్యలు తీసుకోవాలి. ఈ డిమాండ్లను అక్టోబర్ 14లోగా పరిష్కరించాలి.. లేని పక్షంలో అధికారికంగా మేము మొక్కుమటిగా రాజీనామాలు చేస్తామని” వైద్యులు పేర్కొన్నారు. అయితే ముక్కుమ్మడిగా రాజీనామాలు చేయగా.. వాటిని పలువురు వైద్యులకు బెంగాల్ ప్రభుత్వం శనివారం తిరిగి పంపింది. సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వైద్యులు వ్యక్తిగతంగా రాజీనామా చేయాలని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఆ రాజీనామాల విషయంలో వైద్యులు కాస్త వెనక్కి తగ్గినట్టు ప్రచారం జరుగుతోంది.
మమత ఏం చేస్తారు?
ఆ వైద్యురాలి హత్యాచార ఘటన లో మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కేసులో ఇన్వాల్వ్ కావడంతో.. మమత బెనర్జీకి ఊపిరి తీసుకునే సమయం కూడా లేకుండా పోతుంది. ఇటీవల వైద్యులతో పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అంతగా ప్రయోజనం లేకుండానే ముగిసాయి. ఇక ఇటీవల వైద్యులతో మమత చర్చలు జరిపారు. వాటిని లైవ్ రికార్డ్ చేయడానికి ఒప్పుకున్నారు. వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి పరిష్కారానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతోపాటు జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. వారికి సీనియర్ వైద్యులు సంఘీభావం చెబుతున్నారు. ఫలితంగా మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎటూ పాలు పోవడం లేదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Senior doctors from many government hospitals including rg hospital have resigned for justice in kolkata doctors case
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com