https://oktelugu.com/

డిసెంబర్ 25కు చూడండి ఏం జరుగుతుందో?: రఘురామ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన రఘురామకృష్ణ రాజుకు, పార్టీకి మధ్య దూరం పెరిగింది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చివరికి పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే వరకూ దారితీశాయి. ముఖ్యంగా అమరావతి విషయంలో రఘురామ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. అప్పటి నుంచి ఆయన వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. Also Read: బామ్మర్ది బాలయ్యకు చంద్రబాబు ప్రమోషన్ తాజాగా.. మరో దుమారం మొదలైంది. ఎంపీ రఘురామకృష్ణరాజు కనిపించడం లేదంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే.. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2020 3:56 pm
    Follow us on

    వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన రఘురామకృష్ణ రాజుకు, పార్టీకి మధ్య దూరం పెరిగింది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చివరికి పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే వరకూ దారితీశాయి. ముఖ్యంగా అమరావతి విషయంలో రఘురామ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. అప్పటి నుంచి ఆయన వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

    Also Read: బామ్మర్ది బాలయ్యకు చంద్రబాబు ప్రమోషన్

    తాజాగా.. మరో దుమారం మొదలైంది. ఎంపీ రఘురామకృష్ణరాజు కనిపించడం లేదంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే.. దీనిపై ఘాటుగానే స్పందించారు ఆయన. ఓ పెద్ద మనిషి ఆదేశాలతో ఎంపీ కనబడుట లేదు.. సంక్రాంతి కోడి పందాల తర్వాత కనుబడట లేదు, ఎవరికైనా తెలిస్తే తెలియజేయండి అని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను రకరకాలుగా బెదిరించారన్నారు.

    ఇంకా ఆయన మాటల్లోనే.. ‘నేను నా నియోజకవర్గానికి వెళితే ఏదో సాకుతో అరెస్ట్ చేసి.. షెడ్యూల్ క్యాస్ట్ అధికారి ఒకరు ఉంటారట.. ఆ అధికారిని నేనేదో అంటానట.. ఏ అధికారిని నేను ఏదో అంటానట.. ఏమంటానో కూడా ముందే రాసి పెట్టుకుని ఉన్నారు. పైస్థాయి నుంచి వచ్చిన ప్లాన్ అరెస్ట్‌‌కు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎవరైతే చెప్పి చేయిస్తున్నారో.. ఆరు నెలల నుంచి అంతఃపురం నుంచి బయటకు రాకుండా అక్కడక్కడ తిరుగుతూ రికార్డెడ్  ప్రెస్‌మీట్లు పెట్టి కాలక్షేపం చేస్తున్న. కొద్దిమంది నాయకులకు విన్నవించుకునేది ఏంటంటే నా సెక్యూరిటీని తొలిగించేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. నాపై అనర్హత వేటు వేయడానికి అందరి కాళ్లు పట్టుకుంటున్నారట.. ఆ ప్రయత్నాలు ఫలించవు’ అని అన్నారు.

    Also Read: కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం.. ఎవరు చేశారంటే?

    తనపై జరుగుతున్న కుట్రలను ప్రజలు పరిశీలిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నానన్నారు. జరుగుతున్న పరిణామాలపై తనకు ఏం చేయాలో తెలుసని.. ఈ రాష్ట్రంలో న్యాయానికి సంకెళ్లు వేయడానికి ప్రయత్నంలో కొంతమంది చెదల్లా ప్రయత్నిస్తున్నారన్నారు. అలాంటి చెద పురుగుల్ని సమూలంగా నాశనం చేసే శక్తి ఆ న్యాయస్థానాలకు ఉంది.. ఆ చెద పురుగులు ఎవరో ప్రజలకు తెలుసు చెద వదిలే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. డిసెంబర్ 25 క్రిస్మస్ నాటికి చెద వదిలే అవకాశం కనిపిస్తోందని.. ఈ రాష్ట్రానికి చెదలు వదిలిన తర్వాత.. అందరూ సంక్రాంతి సంబరాలు సరదాగా చేసుకుందామని,  రచ్చబండలో మరికొన్ని విషయాలను పంచుకుంటానని రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.