అఖిల్ అక్కినేని హీరోగా పూజాహెగ్డే హీరోయిన్ గా మెగాప్రోడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, సక్సస్ ని కెరాఫ్ అడ్రాస్ గా మార్చుకున్న యంగ్ నిర్మాత బన్ని వాసు, మరో నిర్మాత వాసువర్మ లు సంయుక్తంగా జిఏ2 పిక్చర్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం “Most Eligible బ్యాచ్ లర్” .. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ప్రతి ప్రమొషన్ మెటిరియల్ కి హ్యూజ్ రెస్పాన్స్ రావటం విశేషం. ముఖ్యంగా అఖిల్ అక్కినేని, బోమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ అనగానే ఒక క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా జిఏ2 పిక్చర్స్ బ్యానర్ లో ఈ చిత్రం వస్తుండటం వల్ల మోస్ట్ క్రేజియస్ట్ ఫిల్మ్ అయ్యింది. అయితే మెట్ట మెదటి సారిగా ప్రీ-టీజర్ ని విడుదల చేసారు యూనిట్.. ఈ ప్రీ-టీజర్ అందర్ని విపరీతం గా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ లో మొస్ట్ హ్యండ్‌సమ్ హీరో అఖిల్ అక్కినేని తనని తాను పరిచయం చేసుకుంటూ.. అయామ్ హర్ష, ఓక అబ్బాయి లైఫ్ లో 50 పర్సంట్ కెరీర్, 50 పర్సంట్ మ్యారీడ్ లైఫ్, కెరీర్ ని సూపర్ గా సెట్ చేసా.. ఈ మ్యారీడ్ లైఫే. ఓ అయ్యాయ్యయ్యో.. అంటూ టీజర్ కి లీడ్ ఇచ్చాడు.. ఇలా ప్రీటీజర్ రావటం మోదటిసారి కావటం విశేషం.
Also Read: విశ్వక్‌సేన్ చేతుల మీదుగా లింగోచ్చా టీజర్ విడుదల..
ఇప్పటికే 80% షూటింగ్ ని పూర్తిచేసుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలి ఎంటెర్టైనెర్ సంక్రాంతి కానుకగా రానుంది. అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డె లు మద్య వచ్చే సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గా వుంటాయి.. బొమ్మరిల్లు భాస్కర్ ప్రతి చిత్రం లో ఫ్యామిలి ఆడియన్స్ ని యూత్ ని టార్గెట్ చేసే సీన్స్ వుంటాయి. అలాగే బన్ని వాసు నిర్మించిన చిత్రాలు కూడా ఫ్యామిలి ఆడియన్స్ ని యూత్ ని టార్గెట్ చేస్తారు. వీరి కాంబినేషన్ లో ప్రతి ఫ్యామిలి మెచ్చే జంట అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే ల జంటగా ఈ చిత్రం రానుంది. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలు అందుకుంటారు. ఈ చిత్రానికి సంభందించిన ప్రీ-టీజర్ ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ మరియు ట్రెడ్ లో బజ్ క్రియెట్ చేసింది. ఈ నెల 25 న ఉదయం 11.40 నిమిషాలకి ఈ చిత్రం యోక్క టీజర్ ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం లో ఆమని, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 2021 లో జనవరి సంక్రాంతి కి విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.
నటీ నటులు:
అఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢే
ఆమని
మురళి శర్మ
జయ ప్రకాశ్
ప్రగతి
సుడిగాలి సుధీర్
గెటెప్ శ్రీను
అభయ్
అమిత్
Also Read: బొమ్మబ్లాక్ బస్టర్ ఆడియో ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన వరుణ్ తేజ్..
సాంకేతిక నిపుణులు..
బ్యానర్ : జీఏ2 పిక్చర్స్
సమర్పణ : అల్లు అరవింద్
మ్యూజిక్ : గోపీ సుందర్
సినిమాటోగ్రాఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ
ఎడిటర్ : మార్తండ్ కే వెంకటేశ్
ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్లా
పి ఆర్ ఓ..ఏలూరు శ్రీను
నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ
డైరెక్టర్ : బొమ్మరిల్లు భాస్కర్