https://oktelugu.com/

విశ్వక్‌సేన్‌ చేతుల మీదుగా లింగోచ్చా టీజ‌ర్ విడుద‌ల..

కెరాఫ్ కంచెర‌పాలెం చిత్రం లో జోసెఫ్ గా నటించి వీక్షకుల్ని ఆక‌ట్టుకున్న కార్తిక్ రత్నం హీరోగా, సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్ గా ప్ర‌ముఖ నిర్మాత యాద‌గిరి రాజు శ్రీక‌ళ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో, బ్లాక్ బాక్స్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ లో నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా (గేమ్ ఆఫ్ లవ్).. ఈ చిత్రానికి ఆనంద్ బ‌డా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌ర్శ‌కుడు హైద‌రాబాది కావ‌టం వ‌ల‌న ఇక్క‌డ ఎంతో ఫేమ‌స్ అయిన లింగోచ్చా గేమ్ నేప‌ధ్యం లో ఒక చ‌క్క‌టి […]

Written By:
  • admin
  • , Updated On : October 19, 2020 / 03:09 PM IST
    Follow us on

    కెరాఫ్ కంచెర‌పాలెం చిత్రం లో జోసెఫ్ గా నటించి వీక్షకుల్ని ఆక‌ట్టుకున్న కార్తిక్ రత్నం హీరోగా, సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్ గా ప్ర‌ముఖ నిర్మాత యాద‌గిరి రాజు శ్రీక‌ళ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో, బ్లాక్ బాక్స్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ లో నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా (గేమ్ ఆఫ్ లవ్).. ఈ చిత్రానికి ఆనంద్ బ‌డా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌ర్శ‌కుడు హైద‌రాబాది కావ‌టం వ‌ల‌న ఇక్క‌డ ఎంతో ఫేమ‌స్ అయిన లింగోచ్చా గేమ్ నేప‌ధ్యం లో ఒక చ‌క్క‌టి ప్రేమ‌క‌థ‌ని రాసుకుని తెర‌కెక్కించారు. అంతే కాదు ఈ ప్రేమ‌క‌థ కి లింగోచ్చా అనే టైటిల్ ని ఖ‌రారుచేయ‌టం విశేషం. ఈ టైటిల్ విన్న ప్ర‌తిఓక్క‌రూ సౌండింగ్ కొత్త గా వుంద‌ని అన‌టం యూనిట్ కి కొత్త ఎన‌ర్జి ఇచ్చింది. ఇదే ఎన‌ర్జితో లింగోచ్చా టీజ‌ర్ ని రెడి చేశారు. యూత్ ఫుల్ మాస్ హీరోగా ఇటీవ‌లే హ్యూజ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ చేతుల మీదుగా ఈ టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌టానికి చిత్ర యూనిట్ అంతా సిద్ద‌మైంది. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 23 న ఈ టీజ‌ర్ ని గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్నారు.

    Also Read: నిశ్శబ్ధం మూవీకి ఫ్లాప్ బెంగ ఇలా తీరింది?

    ఈ సంద‌ర్బంగా నిర్మాత యాద‌గిరి రాజు మాట్లాడుతూ.. సినిమా రంగం లో ఎప్ప‌టినుండో వున్నాము. కాని ఎప్పూడూ సినిమా నిర్మించాల‌ని అనుకోలేదు. లింగోచ్చా నేపథ్యంలో ఆనంద్ బ‌డా చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. అలాగే ఈ క‌థకి హీరో కార్తిక్ ర‌త్నం సరిగ్గా సరిపోయాడు.. అత‌ని ఎన‌ర్జి మా సినిమా కి ప్ల‌స్ అవుతుంది. ఈ చిత్రం లో చేసిన హీరోయిన్ సుప్యార్ధ్ సింగ్ మ‌రియు అదిరింది షో స‌ద్దాం, పటాస్ బల్వీర్ సింగ్ ఇలా అంద‌రూ చాలా నేచుర‌ల్ గా న‌టించి మెప్పించారు. ఈ టీజ‌ర్ ని విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 23 న‌ హీరో విశ్వ‌క్ సేన్ చేతుల మీదుగా విడుద‌ల చేస్తున్నాం. ఈ టీజ‌ర్ త‌ప్ప‌కుండా అంద‌రి ఆద‌ర‌ణ పోందుతుంది అన్నారు

    ద‌ర్శ‌కుడు ఆనంద్ బ‌డా మాట్లాడుతూ.. మా నిర్మాత యాద‌గిరి రాజు గారు ఈ చిత్ర క‌థ ని న‌మ్మి నిర్మించినందుకు ఆనందంగా వుంది. కొన్ని యదార్ధ సంఘటనలు ఇచ్చిన స్పూర్తితో ఈ కధని రాసుకున్నాను. “లింగోచ్చా” అని చెప్పినప్పుడు చాలా మంది అదేంటి అని వింతగా అని అడిగారు. కానీ దాని అర్ధం తెలిసాక అందరూ బావుంది అని చెప్పారు, ఇంతకీ లింగోచ్చా అంటే ఏడు పెంకులాట, లాగోరి, పిటో, సెవెన్ స్టోన్స్ అని ఒక్కో చోట ఒక్కో పేరుతో ఆడతారు. అలాంటి ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాని నిర్మించిన మా నిర్మాత గారికి ధ‌న్య‌వాదాలు. అలానే ఈ చిత్ర క‌థ అనుకున్న‌ప్పుడు ఎవ‌రు స‌రిపోతారా అనే డైల‌మాలో వున్న నాకు కేరాఫ్ కంచెర‌పాలెం లో మెరుపులా మెరిసాడు కార్తిక్ ర‌త్నం.. తన నాచురల్ నటనతో “ధగడ్ శివ” పాత్రలో చాలా బాగా చేశాడు. టీజ‌ర్ లో “ధగడ్ శివ & బాచ్” ఎన‌ర్జీని చూస్తారు. అలాగే హీరోయిన్ సుప్యార్ధ సింగ్ తన అందం అభినయంతో ఆకట్టుకొని కార్తీక్ కి సరిజోడి గా నిలిచింది. ఇక ఒక మంచి రోల్ లో కునాల్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. చిన్నప్పటి హీరో హీరోయిన్ లు గా నటించిన ఫిదా మొగల్, ప్రేమ్ సుమన్ వారి క్యూట్ పెరఫార్మెన్స్ తో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. సద్దాం, బల్వీర్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, ఇస్మాయిల్ బాయ్ కామెడి టైమింగ్ కి ధియెట‌ర్ అంతా గోల గోల పెడుతుంది. ఈ చిత్రం టీజ‌ర్ ని మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ చేతుల మీదుగా విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 23 న విడుద‌ల చేస్తున్నాం. కొన్ని చిత్రాలు ఎంత బాగున్నా దియెట‌ర్ బ‌య‌ట‌కు రాగానే మ‌ర్చిపోతాం.. కాని లింగోచ్చా మెమ‌రీస్ మీ ఇంటికి కూడా తీసుకొస్తారు. ఇది మా యూనిట్ అంద‌రి నమ్మ‌కం అని అన్నారు..

    Also Read: 18 పేజీస్ లో డైనిమిక్ హీరో నిఖిల్ కి జోడిగా అనుపమ

    Cast:
    కార్తీక్ ర‌త్నమ్, సుప్యార్దే సింగ్, బెబీ ఫిదా మొగ‌ల్, మాస్ట‌ర్ ప్రేమ్ సుమ‌న్, ఉత్తేజ్, తాగుబోతు ర‌మేశ్, కునాల్ కౌశిక్‌, బ‌ల్వీర్ సింగ్ ,స‌ద్దామ్ హుస్సెన్‌, మిమిక్రి మూర్తి, ధీర్ చ‌ర‌ణ్ శ్రీవాస్త‌వ్‌(ఇస్మాయిల్ భాయ్), ఫిష్ వెంక‌ట్‌ త‌దిత‌రులు

    Technicians :
    బ్యాన‌ర్ – శ్రీక‌ళ‌ ఎంటర్టైన్మెంట్స్
    స‌మ‌ర్ప‌ణ – బ్లాక్ బాక్స్ స్టూడియోస్
    మాట‌లు – ఉద‌య్ మ‌దినేని
    ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – మ‌ల్లేశ్ క‌న్జ‌ర్ల‌
    లైన్ ప్రొడ్యూస‌ర్స్ – సందీప్ తుమ్కుర్, శ్రీనాధ్ చౌద‌రి
    ప‌బ్లిసిటి డిజైన‌ర్‌- శ్రావ‌ణ్ మెంగ‌
    పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌- ఏ వెంక‌టేశ్వ‌రావు
    కొరియోగ్ర‌ఫి- భాను
    మ్యూజిక్ – బికాజ్ రాజ్
    ఎడిటింగ్ – మ్యాడీ, శ‌శిబ‌డా
    చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ – బాబీ గంధం
    పీఆర్ఓ – ఏలూరు శ్రీను,
    నిర్మాత – యాద‌గిరి రాజు
    క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం – ఆనంద్ బ‌డా