Homeజాతీయ వార్తలుSecunderabad Railway Station Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల ను లైట్ తీసుకుంటున్న...

Secunderabad Railway Station Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల ను లైట్ తీసుకుంటున్న ఉభయ రాష్ట్రాల పోలీసులు

Secunderabad Railway Station Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసును ఉభయ రాష్ట్రాల పోలీసులు లైట్ తీసుకుంటున్నారా? కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కీలక పాత్రదారులను అరెస్ట్ చేయకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. తాజాగా కేసు లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విధ్వంసం వెనక ప్రైవేట్‌ డిఫెన్స్ అకాడమీ ల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సాయి డిఫెన్స్ అకాడమీ ఛైర్మన్ ఆవుల సుబ్బారావు పై పలు ఆరోపణలు వచ్చాయి. ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదు. కాగా ఏపీ పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును.. తెలంగాణ పోలీసులు ఎందుకు ప్రశ్నించలేదని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడులకు పాల్పడినవారు సాయి అకాడమీకి చెందినవారిగా గుర్తించారు. వాట్సాప్‌ చాటింగ్‌, గ్రూప్స్, కాల్ రికార్డింగ్స్‌లో.. సుబ్బారావు పాత్రపై ఆధారాలున్నా ఎందుకు వదిలేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Secunderabad Railway Station Riots
Avula Subbarao

కొంతమందిపై కేసు పెట్టి..

ఆందోళన చేసిన కొంతమంది యువకులపై పోలీసులు కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఆవుల సుబ్బారావు విషయంలో తెలుగు రాష్ట్రాల పోలీసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు సంప్రదించలేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. అయితే సుబ్బారావు పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ పోలీసులు అంటున్నారు. సుబ్బారావు విషయంలో రెండు రాష్ట్రాల పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గుంటూరు, నర్సారావుపేట నుంచి వచ్చిన 10 మంది అభ్యర్థులు రైలు బోగీల్లోకి వెళ్లి నిప్పు పెట్టినట్లు విచారణలో తేలింది. వారు అలా చేయడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహాజ్వాలలు ఎగిసిపడి ఉద్రిక్తతకు దారితీసింది. ఫలితంగానే ఈ ఘటన రైల్వే పోలీసుల లాఠీచార్జి చేయడం.. ప్రతిగా అభ్యర్థులు రాళ్లదాడికి దిగడం.. చివరికి పోలీసుల కాల్పుల దాకా వెళ్లింది. ఇలా అరగంట లోనే సికింద్రాబాద్‌ రైల్యే స్టేషన్‌ రణరంగంగా మారింది. ముందస్తు పథకం ప్రకారమే ఆవుల సుబ్బారావు.. నిరసనకారులకు అవసరమైన పులిహోర ప్యాకె ట్లు, మంచినీళ్ల ప్యాకెట్లు సరఫరా చేశాడు. గుంటూరు, నర్సారావుపేట నుంచి వచ్చిన 450 మంది అభ్యర్థుల తాలూకు ఖర్చులు ఆయనే భరించినట్లు విచారణలో తేలింది. కాగా, విధ్వంసానికి కారణమైన వారిలో 52 మందిని పోలీసులు గుర్తించారు. వారిలో 19 మంది గోపాలపురం పోలీసుల అదుపులో ఉండగా.. మిగిలిన వారిని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్‌ గ్రూపుల ఏర్పాటుపై ఆరా తీసి నట్లు సమాచారం. విచారణ అనంతరం గోపాలపురం పోలీసు లు 19 మంది నిరసనకారులకు గాంఽధీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాత్రి ఎల్బీనగర్‌లోని రైల్వే కోర్టు జడ్జి నివాసంలో హాజరుపర్చి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Secunderabad Railway Station Riots
Secunderabad Riots

Also Read: Adivi Sesh: ఆ హీరోకి ఉన్న అఫైర్లు నాకు లేవు – అడవి శేష్

అసలు సూత్రధారి సుబ్బారావే..

ఆవుల సుబ్బారావు ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం వాస్తవ్యుడు, తెలుగు రాష్ట్రాల్లో సాయి డిఫెన్స్‌ అకాడమీ పేరుతో శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీసి.. తన ప్రసంగాలతో అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను రెచ్చగొట్టి.. ఆందోళన కార్యక్రమానికి పథకం పన్ని.. అందుకు వేదికగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసి.. వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌చేసి.. అభ్యర్థులను తరలింపులో అన్నీతానై వ్యవహరించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఆవుల సుబ్బారావు గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయ్యా డు. పదమూడేళ్ల క్రితం ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీ పేరుతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఏటా వందల మందికి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ ఇస్తున్నాడు. తెలుగురాష్ట్రాల్లో 9 వరకు సాయి డిఫెన్స్‌ పేరుతో శిక్షణ కేంద్రాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ‘అగ్నిపథ్‌’ గురించి ప్రకటన చేసిన తర్వాత ఈ పథకం ఆర్మీ ఉద్యోగాలకు గండికొట్టేలా ఉందని తమ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆవుల చెప్పాడు. సికింద్రాబాద్‌ అల్లర్లకు మూడు రోజులు ముందు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా గుంటూరులో ఆవు ల భారీ ర్యాలీ నిర్వహించాడు. ఇందులో ఆయన అకాడమీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సన్నద్ధమవుతున్న వందలమంది అభ్యర్థులు పాల్గొన్నారు. అనంతరం అభ్యర్థులను ఉద్దేశించి ఆవుల మాట్లాడారు. అగ్నిపథ్‌ దుర్మార్గమైన పథకం అని, ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలని కలలుగనే యువత ఆశయాలకు గండికొట్టేలా ఉందని ఉపన్యసించినట్లు తెలిసింది.

Also Read: Harassment Of Bears: సిక్కోలులో భల్లూకాల బీభత్సం.. ప్రాణాలు కోల్పోతున్న జనం

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular