ఆ ఒక్కటీ అడక్కు?.. పోలవరం టెండర్ లోగుట్టు

రాజకీయాల్లో రచ్చ చేయడం మూమూలే. ఒక పార్టీ ఇంకో పార్టీపై నిందలు వేయడం షరామామూలే. అధికార పక్షం, ప్రతిపక్షంపై ప్రతిపక్షం అధికార పక్షంపై విరుచుకు పడడం సాధారణమే. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో మరోలా ప్రవర్తించడం చూస్తుంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులుగా అనిపించిన విషయాలు తర్వాత అధికారంలోకి వచ్చిన తరువాత ఒప్పులుగా అనిపించడం గుర్తిస్తాం. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని గొప్పలు చెబుతున్నా అందులో నిజం ఉండదన్న విషయం అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాత్రికి రాత్రే […]

Written By: NARESH, Updated On : May 24, 2021 1:28 pm
Follow us on

రాజకీయాల్లో రచ్చ చేయడం మూమూలే. ఒక పార్టీ ఇంకో పార్టీపై నిందలు వేయడం షరామామూలే. అధికార పక్షం, ప్రతిపక్షంపై ప్రతిపక్షం అధికార పక్షంపై విరుచుకు పడడం సాధారణమే. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో మరోలా ప్రవర్తించడం చూస్తుంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులుగా అనిపించిన విషయాలు తర్వాత అధికారంలోకి వచ్చిన తరువాత ఒప్పులుగా అనిపించడం గుర్తిస్తాం. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని గొప్పలు చెబుతున్నా అందులో నిజం ఉండదన్న విషయం అందరికీ తెలుసు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాత్రికి రాత్రే రూ.2500 కోట్ల మేర అంచనాలు పెంచారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టును పాడి గేదె మాదిరిగా టీడీపీ భావించింది. అంచనాలను ఎప్పటికప్పుడు పెంుకుని భారీ ఎత్తున లంచాలు, కమీషన్లు పిండుకున్నారని ఆరోపణలు చేసిన వైసీపీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు అదే వైసీపీ నేతలు పోలవరం ప్రాజెక్టు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

పోలవరంలో తాము టెండరింగ్ పద్ధతిలో కొత్తగా టెండర్లు పిలిచి రూ.750 కోట్లు ఆదా చేశామని బీరాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు తామే రూ. 3200 కోట్ల మేర అంనాలు పెంచుతూ రాత్రికి రాత్రే జీవో జారీ చేశారని గుర్తు చేశారు. అడ్డగోలుగా దోచుకుతినడానికే ఈ వ్యవహారం. ఇప్పటికే మద్యం, ఇసుక, మట్టి, సిమెంట్ తదితర వాటిల్లో దేన్ని వదలకుండా వేల కోట్ల మేర దోచుకుంటున్నారు. విశాఖలో భూములు కొట్టేశారు. తిరుపతిలో స్వామి వారి భూములు మింగేశారు. ఇంకా చాలడం లేదా అని అయ్యన్నపాత్రులు ప్రశ్నించారు.

రివర్స్ టెండరింగ్ లో రూ.750 కోట్లు ఆదా చేశామని గొప్పలు చెప్పుకున్నా ప్రభుత్వం రూ.3200 కోట్ల మేర అంచనాలు పెంచడం వాస్తవం. దీంతో పారదర్శకంగా ఉండే ఎమ్మెల్యేలు జోక్యం చేసుకునేందుకు ముందుకు రాలేకపోయారు. ఇప్పటికే వైసీపీ నేతలకు ఫోన్లు వెళ్లాయి. ఎవరూ మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎవరు నోరు విప్పేందుకు సాహసం చేయడం లేదు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం కొత్తేమీ కాదు.