https://oktelugu.com/

ఐటమ్ సాంగ్ పై హాట్ బ్యూటీ వివరణ !

హాట్ బ్యూటీ ‘పాయల్ రాజ్ పుత్’లో స్టార్ హీరోయిన్ అయ్యే కెపాసిటీ ఉన్నా.. సరైన జడ్జ్ మెంట్ లేక కెరీర్ ను నాశనం చేసుకుంది. చిన్నాచితకా హీరోల సరసనే పరిమితం అయిపోయి.. ప్రస్తుతం ఆ సినిమాలు కూడా లేక ఇతర ఇండస్ట్రీల వైపు ఆశగా చూస్తోంది. అయితే ఇలాంటి టైంలో ఈ హాట్ బ్యూటీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను వైరల్ చేశారు. అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా త్వరలోనే […]

Written By:
  • admin
  • , Updated On : May 24, 2021 / 02:01 PM IST
    Follow us on

    హాట్ బ్యూటీ ‘పాయల్ రాజ్ పుత్’లో స్టార్ హీరోయిన్ అయ్యే కెపాసిటీ ఉన్నా.. సరైన జడ్జ్ మెంట్ లేక కెరీర్ ను నాశనం చేసుకుంది. చిన్నాచితకా హీరోల సరసనే పరిమితం అయిపోయి.. ప్రస్తుతం ఆ సినిమాలు కూడా లేక ఇతర ఇండస్ట్రీల వైపు ఆశగా చూస్తోంది. అయితే ఇలాంటి టైంలో ఈ హాట్ బ్యూటీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను వైరల్ చేశారు.

    అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. కాగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. మరి ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తోన్న బంగార్రాజు సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం పాయల్ ను తీసుకుంటున్నారని బాగా ప్రచారం జరిగింది.

    ఈ ప్రచారం విని విని విసిగిపోయిన పాయల్ మొత్తానికి ‘బంగార్రాజు’ సినిమాలో తన ఐటమ్ సాంగ్ గురించి స్పందించింది. “నేను ఏ ఐటమ్ సాంగ్స్ ల్లోనూ నటించడం లేదు. దయచేసి ఇలాంటి రూమర్స్ నా పై రాయకండి. ఇది చెప్పాలనేదే ఈ పోస్ట్’ అంటూ మొత్తానికి పాయల్ ‘బంగార్రాజు’ పేరెత్తకుండానే వస్తోన్న పుకార్ల పై క్లారిటీ ఇచ్చింది.

    ఏది ఏమైనా పాయల్ రాజపుత్ కెరీర్ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో ఉంది. వచ్చిన ఫుల్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఆరాట పడిన పాయల్, ఆ క్రేజ్ ను కాపాడుకోవడానికి మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ‘ఆర్ ఎక్స్ 100’, ‘వెంకీ మామా’ హిట్స్ ను కూడా సరిగ్గా వాడుకోలేకపోయింది.