ఏపీకి మూడు రాజధానులు ఉండగా.. లేనిది.. తెలంగాణకు మరో రాజధాని ఉంటే తప్పేంటి? అయినా 10 జిల్లాలను 31 జిల్లాలను చేసిన కేసీఆర్ తెలంగాణకు రెండో రాజధానిని చేయలేరా? ఖచ్చితంగా చేస్తారని అంటున్నాయి రాజకీయవర్గాలు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందుతున్నాయన్న చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది.
Also Read: అడుక్కుంటున్న పత్రికలు.. ఎంత ఘోరం?
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటవుతున్న వేళ తెలంగాణలో మొత్తం అభివృద్ధి హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది. ఈ మధ్య కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ వేగంగా రూపు మారి అభివృద్ధి వైపు నడుస్తోంది. దక్షిణ తెలంగాణ వెనుకబడుతోందన్న ప్రచారం ఉంది.
నిజానికి హైదరాబాద్ దక్షిణ తెలంగాణలోనే ఉంది. దీంతో తెలంగాణకు రెండో రాజధానిని ఉత్తర తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం.
తాజాగా ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా ప్రస్తావించారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ లాగానే పక్కా విభజన వాది అయిన సీఎం కేసీఆర్ కూడా తెలంగాణలో రెండో రాజధాని చేసే ఆలోచన చేస్తున్నారని తెలిపారు.
కాగా తెలంగాణ రెండో రాజధానిగా కేసీఆర్ కు ఎంతో సెంటిమెంట్ నగరమైన కరీంనగర్ ను చేయబోతున్నట్టు తెలిసింది. ఎందుకంటే కరీంనగర్ కు చుట్టుపక్కల ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలున్నాయి. దీంతో ఉత్తర తెలంగాణకు సెంట్రల్ అయిన కరీంనగర్ ను తెలంగాణ రెండో రాజధానిగా చేస్తారని అంటున్నారు.
Also Read: కేటీఆర్ రెడీ.. మరి లోకేష్?
అయితే మరో వాదన మాత్రం తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ అయితే బాగుంటుందని.. కరీంనగర్ కంటే అభివృద్ధి చెందిన వరంగల్ ను చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందని కేసీఆర్ కు సూచిస్తున్నారట..
అయితే తనకు రాజకీయంగా జన్మనిచ్చి ఉద్యమానికి ఊపిరి పోసిన కరీంనగర్ వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సో తెలంగాణ రెండో రాజధానిగా కరీంనగర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది.
-ఎన్నం