నిన్నటి నుండి వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ లో భారీ వర్ష సూచన లను ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో అడపాదడాపా చినుకులు, ఒక మోస్తరు వర్షం కురవగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఏరులై పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలం, కుందన పల్లి గ్రామానికి చెందిన 12 మంది రైతులు తమ పొలాలకు మోటార్లు తీసుకువచ్చేందుకు వెళ్ళగా వారంతా వరద నీటిలో చిక్కుకుపోయారు.
Also Read: తెలంగాణకు రెండో రాజధాని? ఏదంటే?
వాగు దాటేందుకు వీలులేకుండా పొంగి ప్రవహిస్తున్న వరదనీటి నుండి తమ వారిని కాపాడాలంటూ పోలీసులకు వారి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని చూసి వెనకడుగు వేయగా విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకట రామిరెడ్డి పరిస్థితిని కేటీఆర్ కి వివరించగా.. మంత్రి ప్రత్యేక హెలికాప్టర్ ను రంగంలోకి దింపి వారి ప్రాణాలను కాపాడారు.
ఇక ఇదే విధంగా మెదక్ జిల్లా కోహెడ మండలం లో.. బస్వాపూర్ బ్రిడ్జి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో లారీ కొట్టుకుని పోయింది.ఆ సమయంలో 5 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నా… లారీ డ్రైవర్ శంకర్ ముందుకు వెళ్లాడు. దీంతో ఇసుక లారీ వాగులో కొట్టుకుపోగా. క్లీనర్ ఒడ్డుకు చేరగా లారీ డ్రైవర్ ను కాపాడేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగారు.
Also Read: కేటీఆర్ రెడీ.. మరి లోకేష్?
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదనీటి వల్ల ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ వచ్చినా… ఆస్పత్రిలో చేరి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు కానీ ఈ ప్రమాదమైన వరద నీటి వల్ల మాత్రం తీవ్రమైన ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ” ఈభారీ వర్షాలు నుంచి తప్పించుకుంటే చాలు. బ్రతుకు జీవుడా..!” అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. దీంతో అధికారులు అంతా వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది.