మనలో ప్రతి ఒక్కరూ పాము అంటే భయపడతారనే సంగతి తెలిసిందే. ఒక పామును చూస్తేనే కాళ్లూచేతులు గజగజా వణుకుతాయి. అలాంటిది ఒకే చోట 16 పాములు కనిపిస్తే గుండెల్లో గుబులు పుడుతుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల ప్రాంతంలోని గగ్గల్ పోలీస్ స్టేషన్ లో ఒకేసారి 16 నాగుపాములు పట్టబడ్డాయి. పదుల సంఖ్యలో పోలీసులు ఉండే పోలీస్ స్టేషన్ లో భారీ సంఖ్యలో పాములు పట్టుబడటం ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది.
Also Read: 18వేల అడుగుల ఎత్తుపై మహిళ ప్రసవం.. చివరికి ??
గగ్గల్ పోలీస్ స్టేషన్ లోని పొలీసులకు కొన్ని రోజుల క్రితం ఒకన నాగుపాము కనిపించింది. భయాందోళనకు గురైన పోలీసులు స్థానికంగా పాములు పట్టే వ్యక్తికి పాము గురించి సమాచారం ఇచ్చారు. పాములు పట్టే వ్యక్తి ఆ పామును పట్టుకుని వెళ్లిపోయాడు. దీంతో పాము భయం తొలగిపోయిందని పోలీసులు భావించారు. కానీ ఓ ఉద్యోగికి మాత్రం స్టేషన్ లో ఇంకో పాము ఉందేమో అని అనుమానం కలిగింది.
Also Read: చంద్రుడిపై బిలం ఫోటోలు తీసిన చంద్రయాన్-2 ఆర్బిటర్!
వెంటనే తన అనుమానాన్ని ఉద్యోగి స్టేషన్ ఇన్-ఛార్జ్ మహర్దీన్ కు చెప్పగా అతను పాములు పట్టే వ్యక్తిని పిలిపించాడు. స్టేషన్ మొత్తం వెతకగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 పిల్ల పాములు దర్శనమిచ్చాయి. ఒక్కో పిల్లపాము దాదాపు ఒకటిన్నర అడుగుల పొడవు ఉండటం గమనార్హం. పాములు పట్టే వాళ్లు వాటిని బంధించి అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారు. లేదంటే మాత్రం ఆ పిల్ల పాముల వల్ల ఎంతో మందికి ప్రమాదం జరిగేది.