Homeజాతీయ వార్తలుబీజేపీలో చేరగానే సింథియాకు రాజ్యసభ సీట్

బీజేపీలో చేరగానే సింథియాకు రాజ్యసభ సీట్

కాంగ్రెస్‌ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరడం, వెంటనే ఆయనకు మధ్యప్రదేశ్ నుండి పార్టీ రాజ్యసభ సీట్ కేటాయించడం బుధవారం చకచకా జరిగిపోయాయి. బీజేపీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా సమక్షంలో సింధియా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సింధియాకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సింధియాకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. బీజేపీ రాజమాత విజయరాజే సింధియా కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా సొంతగూటికి రావడం సంతోషంగా ఉందని జేపీ నడ్డా స్వాగతం పలికారు.

సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీని మంగళవారం వీడిన విషయం విదితమే. తన తండ్రి మాధవరావు సింధియా జయంతిరోజే ఆయన కాంగ్రెస్‌ను వీడారు. పార్టీలో 18 ఏండ్ల ప్రస్థానానికి ముగింపు పలికారు.

మరోవైపు బెంగళూరులోని రిసార్ట్‌లో ఉన్న సింధియా అనుకూల వర్గం ఎమ్మెల్యేలు 22 మంది సైతం తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇందులో ఆరుగురు మంత్రులు ఉన్నారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది.

బీజేపీలోకి తనను తీసుకున్నందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు సింధియా కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితాన్ని రెండు ఘటనలు మలుపు తిప్పాయని, తండ్రి మరణం జీవితాన్ని మలుపు తిప్పిందని, ఆయన 75వ జయంతి మరోసారి తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందని చెప్పారు.

2020, మార్చి 10న సరికొత్త నిర్ణయం తీసుకున్నాను అని చెబుతూ నాయకుడికి జనసేన చేయడమే లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఆలోచనలు స్వీకరించే పరిస్థితి లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలకు సేవ చేసే అదృష్టం బీజేపీ కల్పించిందని చెబుతూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనలో విఫలమైందని ద్వజమెత్తారు.

యువతను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, ఆ పార్టీలో యువత నిర్లక్ష్యానికి గురవుతోందని పేర్కొన్నారు. దీంతో దేశానికి యువత సేవలు అందించలేక పోతోందని చెప్పారు. కమల్‌నాథ్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. 2019లో ఎవరూ ఊహించని అద్భుతమైన తీర్పు ప్రజలు బీజేపికి ఇచ్చారని చెబుతూ ప్రధాని మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందని సింధియా నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version