‘రొమాంటిక్’ భామతో బన్నీ ‘ఆహా’

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘అలవైకుంఠపురములో’ బాక్సాఫీస్ రికార్డు సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డును ‘అలవైకుంఠపురములో’ నమోదు చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ వచ్చిన ‘అలవైకుంఠపురములో’ బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ హిట్టుతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ తో వరుస మూవీలను చేస్తున్నాడు. అల్లు అర్జున్ తాజా ‘ఆహా’ కోసం ఓ యాడ్ చేయబోతున్నాడు. ఇందులో బన్నీకి జోడీగా ‘రొమాంటిక్’ భామ కేతికాశర్మ నటిస్తోంది. అల్లు అర‌వింద్ అమెజాన్ […]

Written By: Neelambaram, Updated On : March 12, 2020 12:42 pm
Follow us on

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘అలవైకుంఠపురములో’ బాక్సాఫీస్ రికార్డు సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డును ‘అలవైకుంఠపురములో’ నమోదు చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ వచ్చిన ‘అలవైకుంఠపురములో’ బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ హిట్టుతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ తో వరుస మూవీలను చేస్తున్నాడు. అల్లు అర్జున్ తాజా ‘ఆహా’ కోసం ఓ యాడ్ చేయబోతున్నాడు. ఇందులో బన్నీకి జోడీగా ‘రొమాంటిక్’ భామ కేతికాశర్మ నటిస్తోంది.

అల్లు అర‌వింద్ అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ల‌కు ధీటుగా ‘ఆహా’ పేరుతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని ప్రారంభించారు. దీనికి త్రివిక్ర‌మ్ ఓ యాడ్‌ చేస్తున్నాడు. ఈ యాడ్ షూటింగ్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 10రోజుల పాటు ఈ యాడ్ ను షూట్ చేస్తారని సమాచారం. ఈ యాడ్లో అల్లు అర్జున్ కు జోడీ కేతికాశ‌ర్మ న‌టిస్తోంది. పూరి జగన్మాథ్ తనయుడు ఆకాష్ హీరోగా న‌టిస్తున్న ‘రొమాంటిక్‌’ మూవీ ద్వారా కేతికా శ‌ర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచమవుతోంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీలో నటిస్తున్నాడు. బన్నీకి జోడగా రష్మిక మందనా ఎంపికైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. డీఎస్పీ సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘అలవైకుంఠపురములో’ హిట్టు తర్వాత బన్నీ మరోసారి త్రివిక్రమ్ యాడ్ కోసం కలిసి పని చేస్తుండటం గమనార్హం.