కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దానికి పైగా టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ అగ్ర కథనాయికగా కొనసాగుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ తదితర సినిమాల్లో కాజల్ నటించిన ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయింది. ప్రధానంగా సౌత్ హీరోయిన్లలో కాజల్ కొన్నేళ్లుగా టాప్ ప్లేసులో కొనసాగుతోంది.
Also Read: హీరోయిన్ తమన్నా కరోనా అప్ డేట్..ఏమైందంటే?
35ఏళ్ల ఈ భామ ఇప్పటికీ కూడా టాప్ హీరోల పక్కన నటిస్తూ బీజీగా ఉంది. అయితే ఈ భామ పెళ్లిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఆ మధ్య కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పి.. ఓ బిజినెస్ మ్యాన్ ను చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే అది పుకారుగానే నిలిచింది. కాజల్ చెల్లి నిషా అగర్వాల్ 2013లోనే పెళ్లి చేసుకుంది. ఆమెకు ప్రస్తుతం రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
నిత్యం సినిమాలతో బీజీగా ఉంటున్న ఒకరితో ప్రేమలో ఉందనే టాక్ విన్పిస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ తన ఇన్ స్ట్రాగ్రామ్లో కాదల్ సింబల్ ను పోస్టు చేసింది. ప్రేమ.. పెళ్లిపై కాజల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ కొందరు నెటిజన్లు ఆమెకు త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. కాజల్ కాబోయే భర్త ఇతడే అంటూ ఓ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అతడి గురించి ఆరాతీస్తే.. గౌతమ్ కిచ్లుగా తెల్సింది. ఇతడొక ఇంటీరియర్ డిజైనర్. అంతేకాకుండా రెండు, మూడు వ్యాపారాలు కూడా ఉన్నాయట. గౌతమ్ ఇన్ స్ట్రాగ్రాంను కాజల్ అగర్వాల్ ఫాలో అవుతోంది. కాజల్ కుటుంబంతో గౌతమ్ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయట.
Also Read: రాంగోపాల్ వర్మ నిజస్వరూపాన్ని బయటపెట్టిన నాగబాబు
వీరిద్దరు ఓ సందర్భంలో కలుసుకున్నారని.. కొంతకాలంగా డేటింగ్ ఉన్నారనే గాసిప్స్ విన్పించాయి. ఈక్రమంలోనే కాజల్ కాదల్ సింబల్ పోస్టు చేసింది. దీంతో కాజల్ ప్రేమ.. పెళ్లిపై ఏదైనా ప్రకటన చేస్తుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే కాజల్ తోటిహీరోయిన్లు అంతా పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మరీ కాజల్ ప్రేమ.. పెళ్లిపై స్పందిస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!