https://oktelugu.com/

కొత్త జీవోతో విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్!

కోవిద్19 దెబ్బతో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ అమలుపరుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు ఎటువంటి ఫీజులు వసూలు చేయవద్దని సీఎం కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించిన స్కూల్ ఫీజుల నియంత్రణ జీవోను తెలంగాణ సర్కార్ జారీ చేసింది. విద్యా సంస్థలు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని,అది కూడా నెల వారీగా తీసుకోవాలని సర్కార్ స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం ఎటువంటి ఫీజులు వసూలు చేయవద్దని విద్యా సంస్థలను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 21, 2020 5:32 pm
    Follow us on

    కోవిద్19 దెబ్బతో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ అమలుపరుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు ఎటువంటి ఫీజులు వసూలు చేయవద్దని సీఎం కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించిన స్కూల్ ఫీజుల నియంత్రణ జీవోను తెలంగాణ సర్కార్ జారీ చేసింది. విద్యా సంస్థలు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని,అది కూడా నెల వారీగా తీసుకోవాలని సర్కార్ స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం ఎటువంటి ఫీజులు వసూలు చేయవద్దని విద్యా సంస్థలను విద్యాశాఖ ఆదేశించింది.ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేస్తామని సర్కార్ పేర్కొంది. సీబీఎస్సీ,ఐసీఎస్సీ,ఇంటర్నేషనల్ బోర్డులను కూడా ప్రభుత్వం పరిధిలోకి తెస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

    దీంతో తెలంగాణ విద్యార్దులకు,తల్లిదండ్రులకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. చాలా ప్రైవేటు పాఠశాలలు,కళాశాలలు డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలు వసూళ్లు చేస్తాయి.ఈ సారి ఆ బాధ లేకపోవడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో ఇప్పటికే 1 నుంచి 9 వతరగతి విద్యార్దులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు దాదాపుగా ముగిశాయి. వాటి వాల్యుయేషన్ కొనసాగాల్సి ఉంది. పదో తరగతి పరీక్షల పై మే 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇప్పటి కే ప్రకటించారు. ఇక డిగ్రీ,బీటెక్,ఇతర పీజీ పరీక్షలు కూడా జరగాల్సి ఉంది. పరిస్థితి అదుపులోకి రాకుంటే సెమిస్టర్ పరీక్షలలో విద్యార్దులను పాస్ చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా టెన్త్ పరీక్షలు,ఇంటర్ ఫలితాలు ప్రభుత్వానికి సవాల్ గా మారాయి.