
పూరి జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రథయాత్రకు ఎన్నోఏళ్ల ప్రాచీన చరిత్ర ఉంది. ఒడిశాలో ఎన్నో ఏళ్లుగా పూరి రథయాత్రం లక్షలాది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రతీయేటా ఈ రథయాత్రను 10నుంచి 12రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీనిని తిలకించేందుకు దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. జూన్ 23నుంచి రథయాత్రను నిర్వహించే ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా నేపథ్యంలో ఓ స్వచ్చంధ సంస్థ రథయాత్రను రద్దుచేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన న్యాయస్థానం రథయాత్ర బ్రేక్ వేసిన సంగతి తెల్సిందే.
మరోసారి విచారించనున్న ధర్మాసనం..
సుప్రీం తీర్పుపై దేశంలోని హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలని ఒడిశా ప్రభుత్వం, కేంద్రం న్యాయస్థానాన్ని అభ్యర్థించాయి. దీనిపై సోమవారం జస్టిస్ అరుణ మిశ్రా విచారణ చేపట్టి త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అంగీకరించి త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేశారు. అంతకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రథయాత్రలో ప్రజలు పాల్గొనకుండా నిర్వహిస్తామని న్యాయస్థానికి విన్నవించాయి.
ఒకసారి రథాన్ని ఆపితే.. మళ్లీ అప్పటివరకు ఆగాల్సిందే..
పూరి జగన్మాథ్ రథయాత్రను ఒక్కసారి ఆపితే వరుసగా 12ఏళ్లపాటు నిర్వహించరాదనే ఆచారం ఉంది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో శతాబ్దాలుగా రథయాత్ర కొనసాగుతోందని.. కరోనా కారణంగా రథయాత్రను ఆపడం సరికాదని తెలిపారు. కోట్లాది మంది విశ్వాసం, మనోభావాలతో ముడిపడి ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. ఈసారి ప్రజలు రథయాత్రలో పాల్గొనకుండా నిర్వహిస్తామని చెప్పారు. ఆలయ పూజారులకు సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కరోనా నెగెటివ్ వచ్చిన వారితోనే రథయాత్ర నిర్వహిస్తామని కోర్టు అనుమతించాలని కోరారు.
షరతులతో కూడిన అనుమతి వచ్చేనా..
దీనిపై గతంలోనే సుప్రీం కోర్టు ప్రజారోగ్యం, పౌరుల భద్రత దృష్ట్యా పూరిలో, ఇతర ప్రాంతాల్లో రథయాత్ర నిర్వహించొద్దని ఆదేశించింది. పెద్దసంఖ్యలో ప్రజలు హాజరైతే కరోనా వ్యాప్తి చెందుతుందని కోర్డు భావించి తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్రం, ఒడిశా ప్రభుత్వం ప్రజలు పాల్గొనకుండా రథయాత్ర నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాయి. తమకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఏన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని కరోనా కారణంగా ఆపడం మంచిదికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలోనే సుప్రీంతీర్పు ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.