SBI : దేశంలో అతిపెద్ద బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’.. ఈ బ్యాంకు ద్వారా ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అంతే కాకుండా ఖాతాదారుల నమ్మకమైన బ్యాంకుగా దీనిని గుర్తిస్తారు. అయితే ఎస్బిఐ కి ఎంత ఆదరణ ఉందో.. అంతే ముప్పు కూడా ఉంది. ఎందుకంటే మిగతా బ్యాంకుల కంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కె ఎక్కువ సైబర్ నేరగాళ్లు ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఇప్పటికే కొంతమంది బ్యాంకు ఖాతాదారుల నుంచి మాయమాటలు చెప్పి డబ్బులను లాగేసుకున్నాను. రకరకాల ఫేక్ మెసేజ్ లతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేశారు. అయితే తాజాగా ఎస్బిఐ తమ ఖాతాదారులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే?
ఇటీవల సోషల్ మీడియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో మమేకమై కొత్తగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఉంది. వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా ఉన్న ట్టు వీడియోలో చెబుతున్నారు. అయితే ఈ వీడియో తమకు సంబంధం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది. దీనిని కొందరు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు. ఎస్బిఐ ఇప్పటివరకు ఎలాంటి ఏఐ పెట్టుబడులు పెట్టలేదని.. భవిష్యత్తులో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని తెలిపింది. ఈ సందర్భంగా ఒక ప్రకటన జారీ చేస్తూ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : SBI వినియోగదారులు బీ అలర్ట్..ఆ సేవలు బంద్!
గతంలోనూ ఎస్బిఐ పై రకరకాల ఫేక్ వీడియోలో బయటకు వచ్చాయి. ఎస్బిఐ లో పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు వస్తాయని కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే చాలామంది ఎస్బిఐ ఖాదర్దారులకు ఫోన్ చేసి రివార్డులు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక లింకును పంపి దాన్ని క్లిక్ చేయమని చెప్పేవారు. ఆ లింకు క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాలోనే డబ్బులు మాయమయ్యేవి. అయితే ఆ తర్వాత బ్యాంకు యాజమాన్యం తమ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి లింకులు బ్యాంకు నుంచి పంపించరని.. ఏదైనా అవసరం ఉంటే బ్యాంకు కి రమ్మని సిబ్బంది చెబుతారని పేర్కొంది.
ఇలా ఎన్నో రకాలుగా కొందరు సైబర్ నేరగాళ్లు ఎస్బిఐ బ్యాంక్ విషయంలో మోసాలు చేస్తున్నారని పేర్కొంది. అందువల్ల ఈ బ్యాంక్ అధికారులు అప్రమత్తంగా ఉండి నిజాలు ఏంటో తెలుసుకోవాలని బ్యాంకు యాజమాన్యం తెలుపుతుంది. అయితే తాజాగా రిలీజ్ అయిన వీడియో పై ఎస్ బి ఐ సైతం అప్రమత్తమైంది. ఖాతాదారులు ఈ వీడియో మాయలో పడకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాదారులకు మెసేజ్లను పంపించారు. దీంతో ఫైబర్ నేరగాళ్ల ఈ మోసాన్ని మొదట్లోనే అడ్డుకట్ట వేయాలని ఎస్బిఐ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అయినా బ్యాంక్ ఖాతాదారులు ఎస్బిఐ మెసేజ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు.
Also Read : ఎస్బిఐ కి ఏమైంది.. లావాదేవీలు ఎందుకు నిలిచిపోతున్నాయి?