BRS MLA Sayanna : సాయన్న అభిమానుల దెబ్బకు పారిపోయిన మంత్రులు తలసాని, మల్లారెడ్డి

BRS MLA Sayanna : కొన్ని అభిమానాలను మనం వెలకట్టలేం. మనం చేసే పనులను బట్టి అలాంటి అభిమాన గణం ఏర్పడుతుంది. ఇలాంటి అభిమానగణం మెండుగా ఉన్న వారిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఒకరు.. ఆ నియోజకవర్గం నుంచి ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.. మాట తప్పని, మడమ తిప్పని నేతగా పేరు పొందారు. అలాంటి సాయన్న అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు భారత రాష్ట్ర సమితి నాయకులు పోటీపడ్డారు.. చాలామంది […]

Written By: Bhaskar, Updated On : February 20, 2023 9:59 pm
Follow us on

BRS MLA Sayanna : కొన్ని అభిమానాలను మనం వెలకట్టలేం. మనం చేసే పనులను బట్టి అలాంటి అభిమాన గణం ఏర్పడుతుంది. ఇలాంటి అభిమానగణం మెండుగా ఉన్న వారిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఒకరు.. ఆ నియోజకవర్గం నుంచి ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.. మాట తప్పని, మడమ తిప్పని నేతగా పేరు పొందారు. అలాంటి సాయన్న అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు.

ఈ క్రమంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు భారత రాష్ట్ర సమితి నాయకులు పోటీపడ్డారు.. చాలామంది ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన చాలామంది కన్నీటి పర్యంతమయ్యారు.. ఒక రాజకీయ నాయకుడికి ఇంతకంటే ఘనమైన నివాళి ఇంకేముంటుంది.. ఈ పొలిటికల్ నాయకులు అర్పించే నివాళులు, ఘటించే శ్రద్ధాంజలులు అన్నీ అబ్సర్డ్. ఏదో మీడియాలో వచ్చేందుకు తాపత్రయం తప్ప… బతికి ఉన్నప్పుడు ఈ సాయన్నను పట్టించుకున్నది ఎవరని? ఏ మాటకు ఆ మాట… అప్పట్లో టిడిపిలో ఉన్నప్పుడే చంద్రబాబు సాయన్నకు అంతో ఇంతో గౌరవం కట్టబెట్టాడు. టిడిపి నుంచి బీఆర్ఎస్ లోకి వస్తున్నప్పుడు పదవి ఆఫర్ చేసిన కేసీఆర్.. తర్వాత మాట మార్చాడు.. దీనికి తోడు ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి సాయన్నకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుపడ్డారని ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అయితే సాయన్న మృతదేహానికి నివాళులు అర్పించేందుకు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చినప్పుడు ఆయన అభిమానులు అడ్డుకున్నారు. ” సాయన్న బతికి ఉన్నప్పుడు పదవులు రాకుండా అడ్డుపడ్డ మీరు నివాళులు ఎలా అర్పిస్తారు అంటూ ప్రశ్నించారు. గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో వారు వచ్చినదారి వెంటనే వెళ్ళిపోయారు. కాగా నివాళులు అర్పించే సమయంలో ఇలా నినాదాలు చేయడం కరెక్ట్ కాదని ఓ వర్గం అంటుండగా… బతికి ఉన్నప్పుడు పట్టించుకోని వారు ఇప్పుడు నివాళులు ఎలా అర్పిస్తారంటూ మరో వర్గం కౌంటర్ ఎటాక్ చేస్తోంది.. మొత్తానికి సాయన్నకు తలసాని,మల్లారెడ్డి ఎంత అన్యాయం చేశారో ఈరోజు నిరూపితమైందని ఆయన అభిమానులు అంటున్నారు.