
ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నం ఇప్పుడు అరాచకాలకు కేంద్ర బిందువుగా మారుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఒక్క రోజు వ్యవధిలో జరిగిన రెండు సంఘటనలు ఇప్పుడు విశాఖ మొత్తం చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదేం విచిత్రం అంటూ జనం చర్చించుకుంటున్నారు.
శుక్రవారం హిడెన్ స్పౌట్స్ అనే స్కూల్ ను జేసీబీలతో కూల్చేశారు. ఇది ముమ్మాటికి దౌర్జన్యమే. మానసిక వికలాంగుల పాఠశాలను కావాలనే కక్షతోనే నేలమట్టం చేశారు. పోలీసుల రక్షణతో వచ్చి కూల్చేశారు. దీనికివారు చెప్పే కారణం లీజు గడువు అయిపోయింది. రెన్యూవల్ చేసుకోలేదని. లీజు గడువు రెన్యూవల్ చేసుకోకపోతే కూల్చివేస్తారా అని అందరు ప్రశ్నిస్తున్నారు.
విశాఖ పోలీసులు లక్ష్మి అపర్ణ అనే ఫార్మా ఉద్యోగినితో వ్యవహరించిన తీరు వైరల్ అయింది. పోలీసులు కట్టుదాటిపోయారని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. లాక్ డౌన్ సమయంలో మెడికల్ షాపులో పనిచేస్తున్న ఆమెకు పాస్ ఉంది. కానీ షాప్ నుంచి ఇంటికి వెళ్లేందుకు పరిచయస్తుడైన వ్యక్తి బైక్ పై వచ్చాడు. పాస్ ఉందని చెప్పినా వినకుండా పోలీసులు ఆమె బైక్ పై జరిమానా విధించారు.
ఇదేం అన్యాయమని ఆమె తిరగబడింది. దీంతో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయాలని సీఐ రంకెలేశారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీసుల తీరు చూసి హవ్వ అనుకోవడం విశాఖ వాసులకే కాదు ఏపీ ప్రజల వంతయింది. పోలీసులు వివరణ ఇచ్చినా వారి వాదన ఎవరు నమ్మకపోగా తీవ్ర విమర్శలు వచ్చాయి.