శశికళ మద్దతు ఆ కూటమికేనా..?

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరో ఒకట్రెండు నెలల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈనేపథ్యంలో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఇప్పటివరకు తమిళనాడులో రెండు కూటములు మాత్రమే పనిచేశాయి. అన్నాడీఎంకే, డీఎంకే కూటములు మాత్రమే ఉన్నాయి. ఎన్నికల బరిలో ఇవే నిలుస్తూ వచ్చాయి. అయితే.. జయలలిత, కరుణానిధి మరణానంతరం పరిస్థితులు ఊహించని విధంగా మారిపోయాయి. ప్రధానంగా శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ మరింత వేడెక్కాయి. ఇక ఇప్పుడు మరో కొత్త కూటమి […]

Written By: Srinivas, Updated On : March 16, 2021 11:35 am
Follow us on


తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరో ఒకట్రెండు నెలల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈనేపథ్యంలో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఇప్పటివరకు తమిళనాడులో రెండు కూటములు మాత్రమే పనిచేశాయి. అన్నాడీఎంకే, డీఎంకే కూటములు మాత్రమే ఉన్నాయి. ఎన్నికల బరిలో ఇవే నిలుస్తూ వచ్చాయి. అయితే.. జయలలిత, కరుణానిధి మరణానంతరం పరిస్థితులు ఊహించని విధంగా మారిపోయాయి. ప్రధానంగా శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ మరింత వేడెక్కాయి.

ఇక ఇప్పుడు మరో కొత్త కూటమి తెరమీదకు వచ్చింది. ఎన్నికలు దగ్గరపడే సమయం కొద్దీ తమిళనాడులో కూటముల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యయ్ పార్టీ తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే.. శశికళను ఈ కూటమిలో చేర్చుకునేందుకు కమల్ హాసన్ సుముఖంగా లేరు. అవినీతి ఆరోపణలున్న శశికళను తమ కూటమిలో చేర్చుకోబోమని కమల్ హాసన్ తేల్చి చెప్పారు. తానే తృతీయ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థినని కమల్ హాసన్ ప్రకటించారు.

మరోవైపు.. శశికళ కూడా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. అయితే ఎన్నికల వరకే ఈ ప్రకటన ఉంటుందా? ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే ఓటమి పాలయితే ఆ పార్టీని చేజిక్కిచ్చుకునేందుకు శశికళ ఈ ఎత్తుగడ వేశారా? అన్నది తమిళనాట చర్చనీయాంశంగా మారింది. శశికళ హటాత్తు నిర్ణయం విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో పడేసింది.

శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అన్నాడీఎంకేను గెలిపించాలని మాత్రం పిలుపు నివ్వలేదు. డీఎంకేను ఓడించాలని మాత్రమే శశికళ కోరారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తృతీయ కూటమిలో ఏయే పార్టీలు ఉండబోతున్నాయన్నది మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. అయితే.. లోపాయికారీగా శశికళ కమల్ హాసన్ కూటమికి మద్దతిచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద శశికళ ఎపిసోడ్‌ కమల్‌హాసన్‌కు కలిసి వస్తుందని పలువురు రాజకీయ ప్రముఖులు అంటున్నారు.