https://oktelugu.com/

ఇక నిమ్మగడ్డ అధికారాల్ని వాడాల్సిన అక్కర్లేదేమో..!

మొన్నటి వరకు ఏపీలో పంచాయతీ ఎన్నికల సీజన్‌ నడిచింది. నాలుగు దశల్లో నిర్వహించిన ఎన్నికలు ముగిశాయి. లోకల్‌ ఎన్నికల టైమ్‌లో అక్కడి ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌‌ తన అధికారాలను విరివిగా వాడేశారు. కానీ.. చివర్లో మాత్రం ఆయనకు ఝలక్‌ తప్పలేదు. ఎన్నిక‌ల నిర్వహ‌ణ విష‌యంలో త‌న విశేష అధికారాల‌ను వాడుకున్నారు. కార‌ణాలేవైనా నిమ్మగడ్డ అనుకున్నప్పుడు ఎన్నిక‌ల‌ను నిర్వహించ‌డానికి ఏపీలోని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోలేదు. ఆ అంశం కోర్టుల‌కు చేరి […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 4, 2021 12:48 pm
    SEC
    Follow us on

    Ramesh Kumar
    మొన్నటి వరకు ఏపీలో పంచాయతీ ఎన్నికల సీజన్‌ నడిచింది. నాలుగు దశల్లో నిర్వహించిన ఎన్నికలు ముగిశాయి. లోకల్‌ ఎన్నికల టైమ్‌లో అక్కడి ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌‌ తన అధికారాలను విరివిగా వాడేశారు. కానీ.. చివర్లో మాత్రం ఆయనకు ఝలక్‌ తప్పలేదు. ఎన్నిక‌ల నిర్వహ‌ణ విష‌యంలో త‌న విశేష అధికారాల‌ను వాడుకున్నారు. కార‌ణాలేవైనా నిమ్మగడ్డ అనుకున్నప్పుడు ఎన్నిక‌ల‌ను నిర్వహించ‌డానికి ఏపీలోని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోలేదు. ఆ అంశం కోర్టుల‌కు చేరి నానా ర‌భ‌స జ‌రిగింది.

    Also Read: వీళ్లకు తిరుపతి సీటు గెలిచే సీన్‌ ఉందా..?

    కోర్టుల్లో కూడా ఒక్కోసారి నిమ్మగ‌డ్డ ఆదేశాలు ర‌ద్దయ్యాయి. ఆ త‌ర్వాత అవే మ‌ళ్లీ ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చాయి. ఎట్టకేల‌కు నిమ్మగ‌డ్డ కోరుకున్నట్టుగానే ఎన్నిక‌లు జ‌రిగాయి.. జ‌రుగుతున్నాయి కూడా. ఇక పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్రక్రియ‌లో ముందుగా ఏక‌గ్రీవాల‌న్నింటినీ ఆపి నిమ్మగ‌డ్డ సంచ‌ల‌న నిర్ణయ‌మే తీసుకున్నారు. అయితే.. క‌లెక్టర్ల నివేదిక‌ల అనంత‌రం వాటిపై సానుకూలంగా స్పందించ‌క త‌ప్పలేదు. అలా నిమ్మగ‌డ్డ విశేష అధికారాలు చివ‌ర‌కు క‌లెక్టర్ల నివేదిక‌ల‌తో ఏకీభ‌వించాల్సి వ‌చ్చింది.

    Also Read: ఏపీ పోర్టులన్నీ ఆ దిగ్గజ పారిశ్రామికవేత్తకేనా?

    ఇక మున్సిప‌ల్ ఎన్నిక‌ల విష‌యంలో గ‌తేడాది జ‌రిగిన‌ నామినేష‌న్ల ప్రక్రియ‌ను పూర్తిగా ర‌ద్దు చేసి, కొత్త నోటిఫికేష‌న్ ఇవ్వడానికి చ‌ర్చ జ‌రిగింది. ఒక‌వేళ నిమ్మగ‌డ్డ ర‌మేశ్‌ కుమార్ గ‌త ప్రక్రియ‌ను ర‌ద్దు చేసి ఉంటే అది పెను సంచ‌ల‌నం అయ్యేది. అయితే.. గ‌తంలో కోర్టుకు నిమ్మగ‌డ్డ ఒక మాట చెప్పారు. స్థానిక ఎన్నిక‌ల వాయిదా స‌మ‌యంలో.. ఆ ప్రక్రియ తిరిగి ప్రారంభం అయిన‌ప్పుడు ఆగిన చోట నుంచినే మొద‌ల‌వుతుంద‌ని. స్వయంగా ఎస్ఈసీ ఈ మాట కోర్టుకు చెప్పారు. అలాంటి త‌రుణంలో పాత ప్రక్రియ‌ను ర‌ద్దు చేసి ఉంటే.. అది కోర్టులో నిలిచేది కాదేమో.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    గ‌తంలో నిమ్మగ‌డ్డే ఎస్ఈసీగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నిక‌ల ప్రక్రియ‌ను ఆయ‌నే ఇప్పుడు ర‌ద్దు చేస్తే.. అంత‌కు మించిన దుమారం వేరే ఉండేది కాదు. దానికి కోర్టులు ఏ మేర‌కు ఒప్పుకుంటాయో ప్రస్తుత తీర్పుల‌ను గ‌మ‌నించినా అర్థం అవుతుంది. అభ్యంత‌రాలు వ‌చ్చిన కొన్ని చోట్ల మ‌ళ్లీ నామినేష‌న్లకు అవ‌కాశం అంటూ ఎస్ఈసీ ఇవ్వడాన్నే కోర్టు త‌ప్పు ప‌ట్టింది. అది మీ ప‌ని కాదంటూ.. ఎస్ఈసీ ఆదేశాల‌ను ర‌ద్దు చేసింది. మ‌ళ్లీ నామినేష‌న్లకు తావులేద‌ని న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది. ఇక ఇదే స‌మ‌యంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్రక్రియ‌లో కీల‌క ఘ‌ట్టాలు అన్నీ ముగిశాయి. వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది. అదంతా ఎలాగూ సాఫీగానే జ‌రుగుతుంది. కాబ‌ట్టి.. నిమ్మగ‌డ్డ ర‌మేశ్‌ కుమార్ ప్రత్యేకంగా త‌న విశేషాధికారాల‌ను వినియోగించే ప‌రిస్థితులు ఉండ‌వేమో.