
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలుతో నిత్యావరస సరుకుల షాపులు మినహా అన్ని బంద్ అయ్యాయి. దీంతో మద్యంప్రియులకు మద్యం దొరకక నానా అవస్థలు పడ్డాయి. బ్లాకులో కూడా మద్యం దొరకని పరిస్థితి నెలకొంది. అక్కడక్కడ మద్యం లభించినప్పటికీ అధిక రేట్లకు దొరకుతున్నాయి. చాలాచోట్ల మద్యం రేట్లు తాగకముందే చుక్కలు చూపించడంతో మద్యంబాబులు సరికొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. మద్యంబాబులకు వచ్చిన ఐడియా చూస్తే అవాక్కాల్సిందే..
ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందే లేదోగానీ.. మద్యం బాబుల కష్టాలను మాత్రం దూరం చేసింది. మద్యం దొరకక ఇబ్బందులు పడుతున్న వారికి సరికొత్త కిక్కు నిస్తోంది. లాక్డౌన్లో మద్యంప్రియులు సొంతంగా మద్యాన్ని తయారు చేసుకుంటున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్లో మద్యంబాబులు శానిటైజర్లనే ఆల్కాహల్ గా వాడేస్తున్నారని సమాచారం. విస్కీలో 40శాతం ఆల్కహాల్ మాత్రమే ఉంటుంది. కానీ శానిటైజర్లలో మాత్రం 70శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీంతో మందుబాబులో శానిటైజర్లో వాటర్ ను మిక్స్ చేసుకొని తాగేస్తున్నారట. ఇందుకోసం గూగూల్లో సెర్చ్ చేసి మరీ మద్యం తయారీపై ప్రయోగాలు చేస్తున్నారు.
అయితే దీని వల్ల తాత్కాలికంగా కిక్కు లభిస్తుందేగానీ ఆ తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు. శానిటైజర్లలో ఆల్కహాల్ తోపాటు గ్లిజరిన్, హైడ్రోజన్ పైరాక్సైడ్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. గ్లిజరిన్, హైడ్రోజన్ పైరాక్సాడ్ కాలేయం, కిడ్నీలకు హానీ కలుగజేయస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల శానిటైజర్లపై పరిమితి విధించాలని వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.