ఒక్కొక్క రాష్ట్రంలో మూడు జిల్లాల్లో కరోనా కల్లోలం

దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి వచ్చి నాలుగో వారంలో సగం రోజువు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ కరోనా కేసులు అదుపులోకి రావడం లేదు. ఒక్కో రాష్ట్రంలో సగటున 69 శాతం (ప్రతి పది కేసుల్లో ఏడు) పాజిటివ్ యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. కేసుల సంఖ్యతో పాటు రికవరీ అయిన వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. రికవరీ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 5:14 pm
Follow us on


దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి వచ్చి నాలుగో వారంలో సగం రోజువు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ కరోనా కేసులు అదుపులోకి రావడం లేదు. ఒక్కో రాష్ట్రంలో సగటున 69 శాతం (ప్రతి పది కేసుల్లో ఏడు) పాజిటివ్ యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.

కేసుల సంఖ్యతో పాటు రికవరీ అయిన వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. రికవరీ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా సగం కంటే ఎక్కువ (55.55 శాతం) డిశార్జ్ అయిన రోగులు కూడా ఒక రాష్ట్రంలోని ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు. మరణాల విషయానికి వస్తే 63.9 శాతం మరణాలు కూడా ఈ మూడు జిల్లాల్లోనే రికార్డయ్యాయి.

కేంద్రం 25 రాష్ట్రాల్లోని 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా గుర్తించింది. రాష్ట్రాలవారీగా గుర్తించిన ఈ మూడు జిల్లాలు ఈ జాబితాలో కూడా ఉన్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లో 4,200 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీటిలో ప్రతి రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోనే 80 శాతం కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్ర విషయానికి వస్తే ముంబై, పుణె, థానే జిల్లాల్లోనే 89.27 శాతం కేసులు రికార్డయ్యాయి. రికవరీ అయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వారిలో 83 శాతం మంది ఈ మూడు జిల్లాలకు చెందిన వారే. ఇక గుజరాత్ విషయానికి వస్తే అహ్మదాబాద్, వడోదర, సూరత్ జిల్లాల్లోనే 84.87 శాతం కేసులు నమోదయ్యాయి. రికవర్ అయిన వారిలో 52.05 శాతం మంది ఈ మూడు జిల్లాలకు చెందిన వారే.

మధ్యప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మొత్తం కేసుల్లో 81.81 శాతం ఇండోర్, భోపాల్, ఖార్గావ్ జిల్లాల్లోనే రికార్డయ్యాయి. దక్షిణాది రాస్త్రాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కేసుల సంఖ్య, రికవర్ అయిన వారి సంఖ్యా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇదే సీన్ ఉంది.

కర్నాటకలోని బెంగళూరు, మైసూరు, బెళగావిలోనూ.. కేరళలోని కాసరగోడు, కన్నూర్, ఎన్నాకుళం జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని ఈ మూడు జిల్లాల్లో సగటున 63 శాతం కేసులు నమోదయ్యాయి. అలాగే రికవర్ అయిన పేషెంట్లలో 50 శాతం మంది ఈ మూడు జిల్లాలకు చెందిన వారే.

తమిళనాడులో కరోనా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ విస్తరించింది. టాప్త్రీలో ఉన్న చెన్నై, కొయంబత్తూర్, ఇండస్ట్రియల్ హబ్ తిరుపూర్లో 33.46 శాతమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పర్సెంటేజ్లో కేసులు రికార్డయ్యాయి.

ఇక ఉత్తరప్రదేశ్లో పర్సంటేజ్ కాస్త తక్కువగా ఉంది. ఆగ్రా, లక్నో, గౌతం బుద్ధనగర్ జిల్లాల్లో 45 శాతం యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రం కావడం వల్ల అక్కడ కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. అదే బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని మూడు జిల్లాల్లో యావరేజ్గా 60 శాతం యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి.