Sangibhava Yatra: బాబు’గారు డబ్బులు ఇవ్వరా?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న సమయం అది. ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. నాడు తెలంగాణ కోసం తనపై పెట్రోల్ పోసుకున్నారు హరీష్ రావు.

Written By: Dharma, Updated On : December 15, 2023 12:14 pm

Sangibhava Yatra

Follow us on

Sangibhava Yatra: రాజకీయాల్లో సంఘీభావ యాత్రలు, పరామర్శలు కొత్త కాదు. అయితే అవసరం ఉన్న వరకు ఒకలా.. అవసరం తీరిపోయాక మరోలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తుండడం పరిపాటిగా మారింది. ఇటీవల అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులు పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చేయని తప్పు నాకు అనవసరంగా ఆయనను జైలులో పెట్టారని మనస్థాపంతో చాలామంది గుండె ఆగి చనిపోయినట్లు ఎల్లో మీడియా ప్రత్యేక కథనాలు రాసుకొచ్చింది. దాదాపు 145 మంది చనిపోయినట్లు నిర్ధారించింది. దీనిపై స్పందించిన చంద్రబాబు సతీమణి నిజం గెలవాలి పేరిట వారిని పరామర్శించి.. సాయం చేయాలని నిర్ణయించారు. కొన్ని ప్రాంతాల్లో తిరిగి సాయం చేశారు కూడా. అయితే చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఈ సంఘీభావ యాత్ర నిలిచిపోయింది. కనీసం ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా చెప్పడం లేదు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న సమయం అది. ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. నాడు తెలంగాణ కోసం తనపై పెట్రోల్ పోసుకున్నారు హరీష్ రావు. అగ్గిపెట్టె దొరకక ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆ ఘటన వందలాది మంది యువకుల ఆత్మ బలిదానాలకు ప్రేరేపించింది. ప్రతిరోజు వందలాదిమంది చనిపోయినట్లు అప్పటి ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ ప్రకటించింది. అదే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మ బలిదానాల ఊసు పక్కకెళ్ళిపోయింది. ఉద్యమ తెలంగాణ చాలు.. బంగారు తెలంగాణను సాధించుకుందామని కెసిఆర్ ప్రకటించారు. ఆ ఉద్యమకారుల బలిదానాలను మరిచిపోయారు. దానికి తాజా ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు.

ప్రజలకు ఏదైనా మాట చెప్పినా, హామీ ఇచ్చిన చేసి చూపించాలి. మన విశ్వసనీయతను నిలబెట్టుకోవాలి. ఈ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు. తన తండ్రి అకాల మరణంతో.. మనస్థాపంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరారు. కాంగ్రెస్ హై కమాండ్ తో ఢీ కొట్టి మరీ ముందుకు అడుగులు వేశారు. అక్రమాస్తుల కేసుల్లో జగన్ అరెస్ట్ అయినా.. సంఘీభావ యాత్రను మాత్రం మరువలేదు. తన స్థానంలో సోదరి షర్మిల ని పెట్టి ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా మనస్థాపనతో చనిపోయిన కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున జగన్ సాయం అందించారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.

అయితే ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో 145 మంది చనిపోయినట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసుకు వచ్చాయి. భువనేశ్వరి కొంతమందిని పరామర్శించి.. నగదు సాయం చేశారు. దీంతో మిగతా వారు ఎదురుచూస్తున్నారు. వారికి సాయం చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. భువనేశ్వరి కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఆర్థిక సాయం చేస్తేచాలా బాగుంటుందని సొంత పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. లేకుంటే కనీసం అచ్చెనాయుడు చేతుల మీదుగా నైనా అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.