DRDO New Chairman: భారత రక్షణలో ‘డీఆర్డీవో’ పాత్ర ఎంతో కీలకం. మన శాస్త్రవేత్తలు కనిపెట్టిన క్షిపణులు, విమానాలు, హెలిక్యాప్టర్లు, ఇటీవల సైనికుల సూట్లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. దేశ రక్షణకు ఆయువు పట్టు అయిన డీఆర్డీవోలో నియామయాలు అంటే ఎంతో ప్రతిష్టాత్మకం. అలాంటి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్ధకు తాజాగా కొత్త చైర్మన్ నియామకం అయ్యారు. డీఆర్డీవో కొత్త చైర్మన్ గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ బాధ్యతలు చేపట్టనున్నారు.
![]()
కేంద్రప్రభుత్వంలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులైన కామత్.. ఆటోమేటిక్ గా డీఆర్డీవో చైర్మన్ గానూ వ్యవహరించనున్నారు. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న మన తెలుగు శాస్త్రవేత్త జి. సతీష్ రెడ్డి వైదొలగనున్నారు. ఇక సతీష్ రెడ్డికి కేంద్రం అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించింది. ఆయనను రక్షణ శాఖ సాంకేతిక సలహాదారుగా నియమించింది.
ఇప్పటివరకూ కామత్ డీఆర్డీవోలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఆయనకు ప్రమోషన్ ఇచ్చిన డీఆర్డీవో కొత్త చైర్మన్ చేశారు. కామత్ ఆరవైఏళ్లు వచ్చే వరకూ లేదా.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ పదవిలో ఉంటారు.
దేశంలో అగ్ని, పృథ్వీ, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థల కోసం నావిగేషన్, ఏవియానిక్స్ డిజైన్ లో సతీష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దేశంలోనే అగ్రశ్రేణి రక్షణ శాస్త్రవేత్తగా సతీష్ కు పేరుంది. 2018లో డీఆర్డీవో చైర్మన్ గా సతీష్ నియమితులయ్యారు. 2020లో కేంద్రం ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. తాజాగా రక్షణ శాఖ సలహాదారుగా నియమించి గౌరవించింది.
[…] Also Read: DRDO New Chairman: డీఆర్డీవో కొత్త ఛైర్మన్గా ప్… […]
[…] Also Read: DRDO New Chairman: డీఆర్డీవో కొత్త ఛైర్మన్గా ప్… […]