కమల్‌, శంకర్ పెద్ద మనసు.. వాళ్లకు 4 కోట్ల సాయం

విలక్షణ నటుడు, దక్షిణాది అగ్ర నటుడు కమల్‌ హాసన్‌, లెజెండరీ డైరెక్టర్ శంకర్ పెద్ద మనసు చాటుకున్నారు. తమ కాంబినేషన్లో వస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా సెట్లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కమల్, శంకర్ అండగా నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఇండియన్ 2’ సినిమా కోసం చెన్నైలో వేసిన సెట్లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చెక్కును ఈ రోజు అందజేశారు. గాయపడిన వారి […]

Written By: Neelambaram, Updated On : August 7, 2020 9:46 pm
Follow us on

విలక్షణ నటుడు, దక్షిణాది అగ్ర నటుడు కమల్‌ హాసన్‌, లెజెండరీ డైరెక్టర్ శంకర్ పెద్ద మనసు చాటుకున్నారు. తమ కాంబినేషన్లో వస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా సెట్లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కమల్, శంకర్ అండగా నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఇండియన్ 2’ సినిమా కోసం చెన్నైలో వేసిన సెట్లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చెక్కును ఈ రోజు అందజేశారు. గాయపడిన వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేశారు. మూవీ నిర్మాతతో కలిసి మొత్తం రూ. 4 కోట్ల రూపాయలను అందజేశారు. మరణించిన అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్ , ప్రొడక్షన్ అసిస్టెంట్ మధుకు చెందిన ఒక్కొక్కరి కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు ఇచ్చారు. అలాగే, తీవ్రంగా గాయపడిన లైట్‌మ్యాన్‌కు పరిహారంగా రూ .90 లక్షల ఇచ్చారు. ప్రమాదంలో స్వల్ప గాయాలైన వారికి సైతం రూ .10 లక్షలు ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. ఈ మొత్తాన్ని కమల్‌, శంకర్, లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా సమకూర్చాయి.

Also Read: ప్రభాసే ముందుగా రెడీ అవుతోంది !

అనంతరం శంకర్తో కలిసి కమల్‌ మీడియాతో మాట్లాడాడు. ప్రమాదం జరిగిన సమయంలో దర్శకుడు, తాను అక్కడే ఉన్నామని చెప్పాడు.‘మాలో ఎవరికైనా ఆ ప్రమాదం జరిగి ఉండొచ్చు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రమాదం జరిగిన వారం తర్వాత మేమంతా సమావేశమై బాధితులకు ఏం చేయాలో చర్చించాం. కానీ, కరోనా కారణంగా ఆ తర్వాత మళ్ళీ కలుసుకోలేకపోయాం’ అని చెప్పాడు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌ సిటీలో ఇండియన్‌2 మూవీ చిత్రీకరణ జరుపుతుండగా ఫిబ్రవరి 19న భారీ లైటింగ్‌ పరికరాలను క్యారీ చేస్తున్న పెద్ద క్రేన్‌ విరిగి పడడంతో ముగ్గురు మృతి చెందగా, కొందరు గాయపడ్డారు. క్రేన్ కూలిన ప్రాంతానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న శంకర్, తాను త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాని కమల్‌ పేర్కొన్నాడు.ఇకపై షూటింగులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ బీమా కల్పించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లైకా ప్రొడక్షన్స్‌ ప్రొడ్యూసర్లను కోరాడు.

Also Read: బర్త్‌డే వేడుకలు వద్దన్న మహేష్.. గిఫ్ట్‌ రెడీ చేస్తున్న తమన్‌

ఇక, ఇండియన్‌ 2 షూటింగ్‌న తొందర్లోనే తిరిగి ప్రారంభిస్తామన్న కమల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. షూటింగ్‌ను ఇంతకాలం వాయిదా వేయడం వల్ల రోజు వారీ సినీ కార్మికుల కష్టాలు మరింత పెరుగుతాయన్నాడు. సెట్స్‌లో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించాడు. కరోనా టైమ్‌లో ఫిల్మ్‌ సెట్స్‌లో ఎలా పని చేయాలనే విషయమై విదేశాల్లో కొంత మంది పరిశోధనలు చేసి కొన్ని మార్గాలను సూచించారని, వాటిని తాము పాటించే ప్రయత్నం చేస్తామని చెప్పాడు. కాగా, 1996లో వచ్చిన ఇండియన్‌ (తెలుగులో భారతీయుడు)కు సీక్వెల్‌గా వస్తున్న ఇండియన్‌ 2పై కమల్‌ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్దార్థ్‌ తదితరులు కూడా నటిస్తున్నారు.