AP Movie Tickets Issue: ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశంపై గత కొద్ది రోజులుగా వివాదం అలానే ఉండిపోయింది. హైకోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 2న అమరావతిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌కు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రేక్షకుల సంఘం తరఫున కొంత మందికి ఆహ్వానం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వివాదమై రెండు సార్లు సమావేశం జరిగింది. కానీ, చర్చలు అంతగా జరగలేదు.
సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తమ డిమాండ్లను ప్రభుత్వ కమిటీ ఎదుట ఉంచారు. ప్రభుత్వం నియమించిన కమిటీ ఆ విషయాలను నోట్ చేసుకుంది. అయితే, ఏపీ సర్కారు, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న గ్యాప్ ను కొంత మేరకు అయినా తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ సమస్యలపైన చర్చించినట్లు తెలిపారు. త్వరలో సినీ పరిశ్రమ ఇబ్బందులు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని మాత్రం చిరంజీవి, జగన్ ల భేటీ మర్యాదపూర్వకమేనని, పలకరింపుల కోసమేనని అధికారికమైనది కాదని పేర్కొన్నారు.
తాజాగా సినీ ఇండస్ట్రీ తరఫున వచ్చి సమస్యలను కమిటీ ఎదుట వివరించాలని చిరంజీవికి ఏపీ సర్కారు నుంచి ఆహ్వానం అందిందనే ప్రచారం జరుగుతోంది. అయితే, చిరు.. కరోనా బిరన పడిన నేపథ్యంలో ఆయన అక్కడకు వెళ్లే చాన్సెస్ అయితే కనబడటం లేదు.
Also Read: ఏపీ ఉద్యోగుల్లో టెన్షన్.. వేతనాలు సమయానికి అందుతాయా?
ఇకపోతే సినిమా టికెట్ల ధరల విషయమై ఏపీ హైకోర్టులో వచ్చే నెల 10న విచారణ జరగనుంది. కాగా, ఈ లోపే ప్రభుత్వం నియమించిన కమిటీ సినీ పరిశ్రమ పెద్దలు, ప్రతినిధులతో చర్చలు జరిపి ఓ నివేదిక రూపొందించనున్నట్లు టాక్. అలా మొత్తంగా వచ్చే నెల 10న ఏపీలోని థియేటర్స్ టికెట్స్ ప్రైసెస్ విషయమై వివాదం ముగుస్తుందని కొందరు భావిస్తున్నారు. చూడాలి మరి.. ప్రభుత్వం సమర్పించే నివేదికపైన కోర్టు ఏమంటుంది, సినీ పెద్దల వాదనను ప్రభుత్వం ఏ మేరకు అంగీకరించింది? అనే విషయాలు తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. గతంలో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన వాదనను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి అమరావతికి వెళ్లి మరీ వినిపించారు.
Also Read: ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని చెప్పేసిన షర్మిల..!