ఈ సందర్భంగా మంత్రులు రూ.20 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందించేందుకు ముందుకు వచ్చినా బాలిక తండ్రి మాత్రం ససేమిరా అన్నారు. మాకు డబ్బులొద్దు న్యాయం కావాలని విలపించారు. కన్నబిడ్డను పోగొట్టుకున్న తమకు ఆర్థిక సాయం అక్కర్లేదని తిరస్కరించారు. మంత్రులు ఇచ్చిన చెక్కును తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నారు. రాష్ర్టంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. నేతలపై అసలు నమ్మకం లేకుండా పోతోందని వాపోయారు.
దీంతో మంత్రులు ఆ చెక్కును ఇంట్లో పెట్టి వెళ్లిపోయారు. రూ.20 లక్షల చెక్కు మాకు అక్కరలేదని అన్నారు. ప్రభుత్వం నిందితుడిని పట్టుకునేందుకు శ్రద్ధ చూపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రూ.20 లక్షలు ఇచ్చినా అవసరం లేదని తెగేసి చెప్పారు. ప్రభుత్వ తీరుతో వారిలో అసహనం పెరిగిపోయింది. ప్రాణాలను పైసలతో కొంటారా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై బహిరంగంగా విమర్శలు రావడంతో మంత్రులు ఏం మాట్టాడకుండా వెళ్లిపోయారు. ఆరేళ్ల చిన్నారిపై మానవ మృగం పైశాచిక దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు. తమ ప్రాణంగా పెంచుకున్న చిన్నారిని కోల్పోయినందుకు బాధగా ఉందని అన్నారు. అయినా ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టడం దారుణమని అన్నారు.