https://oktelugu.com/

Acharya Movie: సాంగ్ షూట్ లో చరణ్ తో చిరు !

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆచార్య రిలీజ్ డేట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ “ఆచార్య” సినిమాకి ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. ఇంకా రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఈ రోజు రామ్ చరణ్, చిరంజీవిల పై మిగిలిన ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఇక మరో సాంగ్ ను కాజల్, చిరంజీవి పై వచ్చే వారం నుంచి తీయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల పై క్లారిటీ లేదు. […]

Written By:
  • admin
  • , Updated On : September 16, 2021 / 02:43 PM IST
    Follow us on

    Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆచార్య రిలీజ్ డేట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ “ఆచార్య” సినిమాకి ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. ఇంకా రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఈ రోజు రామ్ చరణ్, చిరంజీవిల పై మిగిలిన ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.

    ఇక మరో సాంగ్ ను కాజల్, చిరంజీవి పై వచ్చే వారం నుంచి తీయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల పై క్లారిటీ లేదు. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం సంక్రాంతి బరిలో ఈ సినిమా దిగే అవకాశం ఉంది. అయితే రిలీజ్ ఎప్పుడు అనేది తెలియడం లేదు. అదేంటో ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తున్నా.. మేకర్స్ మాత్రం రిలీజ్ విషయంలో సైలెంట్ గానే ఉంటున్నారు.

    అసలు ఆచార్య రాక గురించి మేకర్స్ కు కూడా క్లారిటీ లేదు. దసరాకి ఈ సినిమా రాబోతుంది అంటూ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తున్నా.. అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. అంటే రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా మంచి బజ్ ఉండే అవకాశం ఉంది.

    అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.