https://oktelugu.com/

Russia occupies Mariupol: మారియుపోల్‌ను ఆక్ర‌మించిన ర‌ష్యా.. అమెరికాకు పుతిన్ సీరియ‌స్ వార్నింగ్‌

Russia occupies Mariupol: ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక ఘటనలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తమ బలగాలను కాస్త వెనక్కి పిలిపించినట్లు కనిపించిన రష్యా.. తిరిగి తన బలగాలను ముందుకు పంపుతోంది. అందులో భాగంగా సిరియాలో రష్యా తరఫున పోరాడిన కీలక మేజర్ ని ఉక్రెయిన్ యుద్ధం కోసం నియమించిన పుతిన్.. అదునుచూసి ఉక్రెయిన్ మీద దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ లో పోరు చేస్తున్న రష్యా బలగాలు కీలక నగరాన్ని హస్తగతం చేసుకున్నాయి. మారియుపోల్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 18, 2022 / 11:50 AM IST
    Follow us on

    Russia occupies Mariupol: ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక ఘటనలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తమ బలగాలను కాస్త వెనక్కి పిలిపించినట్లు కనిపించిన రష్యా.. తిరిగి తన బలగాలను ముందుకు పంపుతోంది. అందులో భాగంగా సిరియాలో రష్యా తరఫున పోరాడిన కీలక మేజర్ ని ఉక్రెయిన్ యుద్ధం కోసం నియమించిన పుతిన్.. అదునుచూసి ఉక్రెయిన్ మీద దాడులకు పాల్పడుతున్నారు.

    తాజాగా ఉక్రెయిన్ లో పోరు చేస్తున్న రష్యా బలగాలు కీలక నగరాన్ని హస్తగతం చేసుకున్నాయి. మారియుపోల్ ను రష్యా సొంతం చేసుకొని.. అక్కడి స్టీల్ ప్లాంట్ లో ఉండి రష్యా సేనలపై పోరాడుతున్న ఉక్రెయిన్, విదేశీ సైన్యాలకు రష్యా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తమ ముందు పోరాడటం మీ వల్ల కాదని, కాబట్టి ఆయుధాలను స్వాధీనం చేయాలని లొంగిపోతే ప్రాణాలతో స్టీల్ ప్లాంట్ బయటకు వెళ్లడానికి అనుమతినిస్తామని ప్రకటించాయి. అయితే దీనిని ఉక్రెయిన్ బలగాలు తిరస్కరించాయి.

    Biden Putin

    రష్యా బలగాలను ధీటుగా తట్టుకొని నిలుస్తున్న ఉక్రెయిన్ ని ఎలాగైనా లొంగదీసుకోవాలని పుతిన్ చూస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ మీద అలుపెరగకుండా క్షిపణి దాడులు చేస్తున్న రష్యా బలగాలు.. ఎంతకీ ఉక్రెయిన్ మీద పైచేయి సాధించలేకపోతున్నాయి. అటు ఉక్రెయిన్ కి బయటి దేశాల నుండి అందుతున్న సాయం మీద, అమెరికా లాంటి దేశాలు చేస్తున్న ఆరోపణల మీద రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

    Also Read: KCR Politics: తెలంగాణను వదిలేశారా.. బీజేపీతో యుద్ధానికే ఆయన ప్రాధాన్యం

    ప్రపంచం ముందు తమను రక్త పిపాసులుగా, అధికార దాహంతో యుద్ధం చేస్తున్న అమెరికా చేస్తున్న ప్రచారం తప్పు అని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ కి సాయం చేస్తున్న దేశాలు జాగ్రత్తగా ఉండాలని కూడా రష్యా హెచ్చరించింది. మరోపక్క తమ దేశానికి చెందిన మస్కోవా యుద్ధ నౌక మందుగుండు పేలుడు వల్లనే మునిగిపోయిందని రష్యా ప్రకటించింది. కాగా రష్యా యుద్ధ నౌకను తమ బలగాలు నేలకూల్చాయని ఉక్రెయిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తానికి రెండు దేశాల మధ్య సాగుతున్న యుద్ధం అంతకంతకు ముదురుతోంది.

    Also Read: Pawan Kalyan New Movie: KGF డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సంబరాల్లో ఫాన్స్

    Tags