Rupee Value: దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిత్యావసరాల ధరలు ఎనిమిదేళ్లుగా గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. కారణం ఈ ఎనిమిదేళ్లలో డాలర్‌లో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం కావడమే. రూపాయి రూ.80 మార్కు దాటింది. కనీవిని ఎరుగని రీతిలో రూపాయి విలువ పతనం అవుతుండడంతో నిత్యావసరాల ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. ప్రజల ఆదాయం పెరుగకుండా, ఆర్థిక వృద్ధి రేటు లేకుండా రూపాయి విలువ మాత్రం రికార్డు స్థాయిలో పతనం కావడమే ఈ పరిస్థితికి కారణమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

రూపాయి రికార్డు పతనం..
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 శాతం వరకు క్షీణించింది. సోమవారం డాలర్ విలువ రూ.80ను తాకినా, రూ.79.98 వద్ద స్థిరపడింది. జులై–సెప్టెంబరు త్రైమాసికంలో డాలర్ మారకపు విలువ రూ.82కు చేరొచ్చని కొన్ని బ్రోకరేజీ సంస్థలు, రూ.79కి పరిమితం కావొచ్చని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశంలో ఎన్నడూ లేనంతగా మోదీ పాలనలో డాలరుతో రూపాయి మారకం విలువ పతనం అవుతుండటంతో ప్రతిపక్షాలు, ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు నిరంతరం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.
Also Read: MP Arvind- CM KCR కేసీఆర్ కు భయపడిపోతున్న ఎంపీ అరవింద్.. సంచలన నిర్ణయం
ఎందుకింత భారీ పతనం..
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? రూపాయి రేటును ఏ అంశాలు నిర్ధారిస్తాయి? అంటే.. ప్రస్తుతం భారతీయులు ఒక డాలర్‌ను కొనాలనుకుంటే బదులుగా మీరు 80 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో ఎక్స్‌చేంజ్ రేట్ (మార్పిడి రేటు) అంటారు. రూపీ–డాలర్ మాత్రమే కాకుండా ఇతర కరెన్సీల మధ్య కూడా ఇలాంటి క్రయవిక్రయాలు జరుగుతుంటాయి.
కరెన్సీ విలువను ఎలా నిర్ణయిస్తారు?
కరెన్సీ క్రయవిక్రయాలు జరిగే చోటును ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ లేదా మనీ మార్కెట్ అంటారు. ఎక్స్‌చేంజ్ రేట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది మారుతూ ఉంటుంది. ఇది తక్కువ కావొచ్చు లేదా ఎక్కువ కావొచ్చు. కరెన్సీ డిమాండ్, సరఫరాపై ఇది ఆధారపడి ఉంటుంది. కరెన్సీకి ఎంత ఎక్కువ డిమాండ్ ఉంటే, దాని విలువ అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలోని అధిక భాగం వ్యాపారం కోసం అమెరికన్ కరెన్సీ డాలర్‌ను ఉపయోగిస్తున్నందున, మనీ మార్కెట్‌లో డాలర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
నిత్యావసాలపై ప్రభావం
భారత్ లాంటి దేశాల్లో క్రూడాయిల్, గ్యాస్ వంటి నిత్యావసర వస్తువులు భారీ స్థాయిలో విదేశాల నుంచి దిగుమతి అవుతాయి. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్స్, మిలిటరీ ఉపకరణాల ఒప్పందాలు కూడా ఎక్కువగా అమెరికన్ కరెన్సీలో జరుగుతాయి. కాబట్టి, భారత్‌కు డాలర్ల అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఈ వస్తువులకు డిమాండ్ మరింత పెరిగితే, అంతర్జాతీయ మార్కెట్‌లో వాటి విలువ పెరుగుతుంది. వాటి దిగుమతి కోసం భారత్ మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. దీని కారణంగానే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. పరిశ్రమల్లో ఖరీదైన చమురు, గ్యాస్‌లను వాడతారు.

డాలర్ ఖరీదు ఎందుకు పెరుగుతుంది?
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చాలా బలహీనపడిందనే మాట గత కొంతకాలంగా నిరంతరం వినిపిస్తూనే ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా ఎకానమీ మందగించిన తర్వాత రష్యా–యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. పశ్చిమ దేశఆలు, రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. చాలా దేశాలు, రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం ఆపేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది అమెరికా, యూరప్‌లను కూడా ప్రభావితం చేసింది. యుద్ధం కారణంగా ఆహార పదార్థాలు, వంటనూనె తదితర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అమెరికా, యూరప్‌లు అత్యధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి.
– భారత్‌లో కూడా ద్రవ్యోల్బణం పెరిగింది. ఫలితంగా విదేశీ పెట్టుబడిదారులు, ముఖ్యంగా విదేశీ కంపెనీలు, వ్యక్తులు భారత్‌లోని పెట్టుబడులను వెనక్కి తీసుకొని వాటిని అమెరికాకు తరలిస్తున్నారు. అమెరికాలో తమ డబ్బు మరింత సురక్షితంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. గత కొన్ని నెలల కాలంలోనే భారత్ నుంచి మిలియన్ల డాలర్ల పెట్టబడులను ఉపసంహరించుకున్నారు. దీని కారణంగానే మనీ మార్కెట్‌లో డాలర్ల సరఫరా కొరత ఏర్పడింది. రాబోయే రోజుల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్, వడ్డీ రేట్లను మరింతగా పెంచుతుందని చెబుతున్నారు. అంటే, మీరు ఒక డాలరుకు ఇప్పుడు చెల్లించే దాని కంటే ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి రావొచ్చు.
Also Read:Janasena Chief Pawan Kalyan: జనసేన’పై పెరుగుతున్న ఇంట్రెస్ట్..: అసంతృప్తి నాయకులంతా పవన్ వైపు..?
[…] Also Read: Rupee Value: అమ్మో రూపాయి.. మోదీ పాలనలో రికార్… […]