Homeజాతీయ వార్తలుVande Bharat Express Trains: ఇంజన్ లేకుండానే పట్టాలపై పరుగులు: వందే భారత్ లో ఊహకందని...

Vande Bharat Express Trains: ఇంజన్ లేకుండానే పట్టాలపై పరుగులు: వందే భారత్ లో ఊహకందని విశిష్టతలు ఎన్నో!

Vande Bharat Express Trains: సాధారణంగా మనకు తెలిసిన, మనం ప్రయాణించిన రైలు ఇంజన్ సహాయంతో పట్టాలపై నడుస్తుంది. ప్యాసింజర్ నుంచి శతాబ్ది వరకు ఇదే విధానం అమలవుతుంది. కానీ ఇంజన్ లేకుండా, ఆ ఇంజన్ కూడా అంతర్భాగమై రైలు నడవడం ఎప్పుడైనా మీరు చూశారా? పోనీ వార్తాపత్రికల్లో చదివారా? న్యూస్ చానల్స్ లో చూశారా? అయితే అలాంటి అద్భుతం గురించి మీరు ఇప్పుడు చదవబోతున్నారు. ఇంతకీ అదేంటంటే..

వందే భారత్

మన రైల్వే వ్యవస్థ బ్రిటిష్ కాలంలో పురుడు పోసుకుంది. అయితే ఇంతవరకు అంతంత మాత్రం గానే అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దానికి సాంకేతికతను జోడించి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ పేరుతో ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టింది. అదిరిపోయే ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీ, అత్యంత వేగం, ఆహా అనిపించే ఏర్పాట్లు, సౌకర్యవంతమైన ప్రయాణం.. ఇవన్నీ కలగలిపితే వందే భారత్ రైలు.. ఇది తొలి సెమీ హై స్పీడ్ రైలు. ఇందులో ప్రయాణం విమానంలో ప్రయాణించిన అనుభూతి కలిగిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 8 వందే భారత్ రైళ్ళు నడుస్తున్నాయి. మలి విడతలో వీటిని మరిన్ని ఎక్కువ సంఖ్యలో పెంచాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

ఇవీ ప్రత్యేకతలు

ఈ రైలు బయటి రూపును ఏరో డైనమిక్ డిజైన్ తో రూపొందించారు. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా డిజైన్ చేశారు. ప్రస్తుత నిర్వహణ దశలో గరిష్ట వేగం పరిమితి గంటకు 160 కిలోమీటర్లు మాత్రమే. ఈ గరిష్ట వేగాన్ని 140 సెకండ్లలో అందుకుంటుంది. ఫుల్లీ సస్పెండెడ్ ట్రాన్సాక్షన్ మోటార్ తో దీని బోగీలు రూపొందించారు. రైలు ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు ఉండవు. ఈ రైలుకు ప్రత్యేకంగా లోకోమోటివ్ జత చేయాల్సిన అవసరం లేదు. రైలులో అంతర్భాగంగానే ఇంజన్ ఉంటుంది. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం రైలు తరహాలో లోకో పైలట్ క్యాబిన్లో రెండు చివర్ల ఉంటాయి. ఇందులో సీట్ల ప్రత్యేకత వేరుగా ఉంటుంది. 180 డిగ్రీల కోణంలో సీట్లు తిప్పుకోవచ్చు. కిటికీ నుంచి బయటకు చూడాలి అనుకున్నప్పుడు సీటు కిటికీ వైపు తిప్పుకోవచ్చు. సభ్యులు రెండు సీట్లు పరస్పరం ఎదురుగా తిప్పుకొని కూర్చోవచ్చు. కోచ్ లో 32 అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో ప్రయాణికులకు రైలు బేగంతో సహా అన్ని వివరాలు డిస్ప్లే అవుతూ ఉంటాయి. రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆడియో అలర్ట్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ తలుపులు ఉంటాయి. వాటి నియంత్రణ లోకో పైలట్ వద్ద ఉంటుంది. మధ్యలో ప్రయాణికులు వాటిని తెరవలేరు, మూయలేరు.. ఇలా రైలు ఆగిన కొన్ని క్షణాల్లోనే డోర్లు తెరుచుకుంటాయి. రైలు బయలుదేరేందుకు కొన్ని సెకన్ల ముందు డోర్లు మూసుకుంటాయి..లోపలి వైపు, బయటవైపు సిసిటివి కెమెరాలు ఉంటాయి. రైలు లోపల వైఫై వసతి ఉంటుంది. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు పరస్పరం ఢీకొట్టుకోకుండా కవచ్ పరిజ్ఞానాన్ని కల్పించారు.

నాలుగు ఎమర్జెన్సీ లైట్లు

ప్రతి కోచ్ లో నాలుగు ఎమర్జెన్సీ లైట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా లో అవాంతరాలు ఏర్పడినప్పుడు వెలిగే విధంగా లైట్లు డిజైన్ చేశారు. ఈ రైల్లో ప్రస్తుతానికి చైర్ కార్ మాత్రమే ఉంటుంది. సాధారణ రైలు లాగా స్లీపర్ బెర్తులు ఉండవు. అందువల్ల వీలైనంత దగ్గర స్టేషన్ల మధ్యలోనే తిరుగుతాయి. రాత్రివేళ ప్రయాణం లేదు. సాధారణంగా దూరప్రాంతాల మధ్య రాత్రి వేల ప్రయాణాన్ని జనం కోరుకుంటారు. నిద్ర సమయంలో ప్రయాణాన్ని ముగించడం ద్వారా పగటిపుట పనులు చూసుకోవచ్చని భావిస్తారు. కానీ వందే భారత్ రైలు పగటివేళ మాత్రమే ప్రయాణించాల్సి రావడం ఓ ప్రతికూల అంశం. దీంతో తదుపరి రైల్లో బెర్తులు ప్రవేశపెట్టే యోచనలో రైల్వే అధికారులు ఉన్నారు. వందే భారత్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో 14 ఏసీ చైర్ కార్ లు, రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కోచ్ లు. ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కోచ్ లో 104 సీట్లు ఉంటాయి. ఎకనామి క్లాసులో 1024 సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైల్లో ఒకేసారి 1128 మంది ప్రయాణం చేయవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version