ఏపీలో మొబైల్ ఆర్టీసీ ఆక్సిజన్ బస్సులు

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అంటారు. ఇప్పుడు కరోనా కల్లోలంలోనూ అలాంటి ప్రయత్నం చేసి ప్రాణవాయువును ఇంటింటికి తిరిగి మరీ అందించే ఏర్పాట్లు చేశారు.  ఇప్పుడు కరోనా కల్లోలం వేళ ప్రజలకు కావాల్సింది చికిత్సలు, ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్. ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో ఏపీలోని రుయా ఆస్పత్రిలో 30 మంది వరకు చనిపోయారు. ఆక్సిజన్ కోసం జనం తిరగని చోటు లేదు.. వెతకని ప్రదేశం లేదు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను మినీ ఆక్సిజన్ మొబైల్ బస్సులుగా […]

Written By: NARESH, Updated On : September 18, 2021 5:34 pm
Follow us on

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అంటారు. ఇప్పుడు కరోనా కల్లోలంలోనూ అలాంటి ప్రయత్నం చేసి ప్రాణవాయువును ఇంటింటికి తిరిగి మరీ అందించే ఏర్పాట్లు చేశారు.  ఇప్పుడు కరోనా కల్లోలం వేళ ప్రజలకు కావాల్సింది చికిత్సలు, ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్. ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో ఏపీలోని రుయా ఆస్పత్రిలో 30 మంది వరకు చనిపోయారు. ఆక్సిజన్ కోసం జనం తిరగని చోటు లేదు.. వెతకని ప్రదేశం లేదు.

ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను మినీ ఆక్సిజన్ మొబైల్ బస్సులుగా మార్చేశారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్ తన ఎంపీ నిధులతో తాజాగా రాజమండ్రిలో ఈ ఆర్టీసీ బస్సులను కోవిడ్ మినీ ఆస్పత్రిగా మార్చి అందులో ఆక్సిజన్ ను బెడ్స్ ను సిద్ధం చేసి ఎవరికి అవసరం అక్కడికి పంపించి వారికి ఆక్సిజన్, బెడ్స్ సౌకర్యాన్ని అందిస్తున్నారు.

ప్రజల కోసం గత ఏడాది ఇంద్ర బస్సులు సంజీవిని గా మారితే…ఈ ఏడాది కరోనా మహమ్మారికి ఆక్సిజన్, బెడ్ల కొరత కారణంగా రెండు వెన్నెల బస్సుల్ని మొబైల్ ఆక్సిజన్ అందించే బస్సులుగా రాజమండ్రి ఎంపీ భరత్ ఆధ్వర్యంలో మార్చేశారు… కాకినాడ వెన్నెల బస్సులు మొదటి చోటు దక్కించుకున్నాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి లో సేవలు అందిస్తాయి. ప్రజల కోసం నిత్యం ఏదోకరకంగా బాధ్యతతో సహాయాన్ని అందించేందు ఎంపీ భరత్ చేసిన ఆలోచన అక్కడి ప్రజలకు స్వాతంన చేకూరుస్తోంది.

ఈ కష్ట సమయంలో కూడా వినియోగం లేని ఆర్టీసీ బస్సులను ఇలా కోవిడ్ మొబైల్ ఆక్సిజన్ ఆస్పత్రులుగా మార్చి వైసీపీ సర్కార్ సేవలు అందిస్తున్నారు.  ఈ కరోనా మహమ్మారి కొంత తగ్గక..ఈ బస్సుల అవసరం తీరిపోయిన తర్వాత వాటిని బాగా శానిటైజ్ చేసి వాడుకలో తీసుకుని వస్తామని.. అప్పటిదాకా కరోనా రోగుల కోసం వాడుదామని ఇలా చేశామని ఎంపీ భరత్ తెలిపారు. ఆ తర్వాత రోజు ప్రయాణానికి ఉపయోగిస్తామని తెలిపారు.