దసరా తర్వాతే ఆర్టీసీ బస్సులా?

అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులపై ఇన్ని రోజులు నెలకొన్న ప్రతిష్టంభన తొలగేలా కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల చర్చలు సఫలం అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో తమ బస్సు సర్వీసులకు సంబంధించి కిలోమీటర్లను తగ్గించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అంగీకరించారు. దీంతో దసరా తర్వాత రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఆ వెంటనే రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించే వీలుంది. Also Read: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మీడియా? లాక్‌డౌన్‌కు […]

Written By: NARESH, Updated On : October 24, 2020 10:42 am
Follow us on

అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులపై ఇన్ని రోజులు నెలకొన్న ప్రతిష్టంభన తొలగేలా కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల చర్చలు సఫలం అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో తమ బస్సు సర్వీసులకు సంబంధించి కిలోమీటర్లను తగ్గించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అంగీకరించారు. దీంతో దసరా తర్వాత రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఆ వెంటనే రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించే వీలుంది.

Also Read: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మీడియా?

లాక్‌డౌన్‌కు ముందు వరకు ఏపీ బస్సులు తెలంగాణలో 2.64 కిలోమీటర్ల మేర తిరిగేవి. తెలంగాణ బస్సులు ఏపీలో 1.61 లక్షల కిలోమీటర్ల మేర సేవలందించేవి. అన్‌లాక్‌ తర్వాత ఇరు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సేవలపై కొత్తగా ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చింది. కానీ.. ఇంకా కొలిక్కి రాలేదు. కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ.. మీరే కిలోమీటర్లు పెంచుకోండంటూ ఏపీ వాదించుకుంటూ వచ్చాయి. దీంతో ఇప్పటిదాకా నిర్వహించిన చర్చలు కూడా ఫలితాలు ఇవ్వలేదు.

తాజాగా శుక్రవారం జరిగిన చర్చల్లో ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలంగాణలో తమ బస్సులను 1.61 లక్షల కిలోమీటర్లు తిప్పేందుకు అంగీకరించారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలకు మార్గం సుగమమైంది. ఈ చర్చల వివరాలను తెలంగాణ అధికారులు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునిల్‌ శర్మకు వివరించారు. వారు సీఎం కేసీఆర్‌కు ఓ నివేదికను సమర్పించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఆ నివేదికలో కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. అదే విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు.. ఏపీ అధికారులకు తెలియజేశారని తెలిసింది. దీనికి ఏపీ సర్కారు అంగీకరిస్తే.. మంగళ లేదా బుధవారం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

Also Read: కేసీఆర్‌.. మొదటిసారి ఒక్క అడుగు వెనక్కి..!

ఈ ఒప్పందం ఏదో పండుగకు ముందే జరిగి ఉంటే.. అటు ఆర్టీసీకి, ఇటు ప్రజలకు ఎంతగానో సౌకర్యంగా ఉండేది. ఇప్పటికే ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఇరు రాష్ట్రాల ఆర్టీసీలకు ఈ అంతర్రాష్ట్ర సేవలు లేకపోవడంతో మరింత నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోవాలంటే కూడా చాలానే సమయం పట్టేలా ఉంది. ఇప్పటికైనా అధికారులు ఆలస్యంగా చేయకుండా సర్వీసులు తొరగా పునరుద్ధరించాలని ప్రజలు కూడా కోరుతున్నారు.