‘ఆర్ఆర్ఆర్’ రచ్చ.. కొమురంభీం అసలు కథేంటీ?

దర్శక దిగ్గజం రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం). ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ ను తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. Also Read: మెగాస్టార్ ను ఇంప్రెస్ చేసిన భారీ ప్లాప్ డైరెక్టర్ ! ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీంగా కన్పించబోతున్నారు. ఇప్పటికే […]

Written By: NARESH, Updated On : October 24, 2020 10:50 am
Follow us on

దర్శక దిగ్గజం రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం). ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ ను తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Also Read: మెగాస్టార్ ను ఇంప్రెస్ చేసిన భారీ ప్లాప్ డైరెక్టర్ !

‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీంగా కన్పించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ సంబంధించిన టీజర్లు విడుదలై నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ కు ధీటుగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ఉందనే టాక్ విన్పిస్తోంది.

తాజాగా విడుదలైన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులను ఎంతోగానో ఆకట్టుకుంది. అయితే ఈ టీజర్ పై అనేక విమర్శలు.. వివాదాలు వచ్చాయి. టీజర్ చివర్లో ఎన్టీఆర్(కొమురంభీమ్)ను ముస్లిం గెటప్ లో చూపించడంపై చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈనేపథ్యంలోనే కొమురంభీమ్ ఎవరు? ఆయన చరిత్ర ఏంటనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. జల్‌(నీళ్లు).. జమీన్‌(భూమి).. జంగల్‌(అడవి).. పేరుతో పోరాటం చేసిన వీరుడు కొమురంభీం అని చెప్పుకుంటున్నారు. 1901లో జన్మించిన కొమరం భీమ్‌.. అల్లూరి సీతరామరాజు స్ఫూర్తిగా అడవి బిడ్డల కోసం పోరాటం చేశాడని.. ఆయన తన 39వ ఏట పోలీసుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడనే విషయాన్ని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళి మార్క్ ట్విస్ట్.. అదేనట..!

కొమురంభీం జీవితాధారంగా 30ఏళ్ల కిందటే ‘కొమురంభీం’ చిత్రాన్ని దర్శకుడు అల్లాణి శ్రీధర్‌ తెరకెక్కించాడు. రూ.16లక్షల వ్యయంతో ‘కొమరం భీమ్‌’ చిత్రం అప్పట్లో నిర్మించారు. ఈ సినిమాలో కొమురంభీంగా భూపాల్‌ నటించాడు. మౌనిక, తెలంగాణ శకుంతల, షరీఫుద్దీన్‌, యాదగిరి ప్రధాన పాత్రల్లో నటించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని వాంకిడి, జోడెఘాట్‌ ప్రాంతాల్లో 1935-40 మధ్యకాలంలో జరిగిన గోండ్ల పోరాటాన్ని దర్శకుడు కళ్లకు కట్టినట్లు ‘కొమరం భీమ్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా గురించి తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలో ప్రస్థావన ఉండటం గమనార్హం. రాజమౌళి సినిమా కేవలం ఫిక్షనల్ కావడంతోనే ఆయన కొమురంభీంను ముస్లిం గెటప్ లో చూపించి ఉంటారనే టాక్ విన్పిస్తోంది.