రూ.5 భోజన పథకానికి ఆరేళ్ళు

హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణలా పేదల ఆకలి తీరుస్తున్న రూ. 5 భోజన పథకానికి ఆరేళ్ళు నిండాయి. ఈ ఆరేళ్లలో దాదాపు 5.5 కోట్ల మీల్స్‌ను ఈ క్యాంటీన్లు ద్వారా అందించారు. ముఖ్యంగా పేదలు, అడ్డాల మీద ఉండే కూలీల కొరకు ఈ పథకం ప్రారంభించడం జరిగింది. పేదల ఆకలి తీర్చడానికి ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్బంగా ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ అక్షయపాత్ర ఫౌండేషన్ యాజన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. కేటీఆర్ […]

Written By: Neelambaram, Updated On : May 15, 2020 3:23 pm
Follow us on

హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణలా పేదల ఆకలి తీరుస్తున్న రూ. 5 భోజన పథకానికి ఆరేళ్ళు నిండాయి. ఈ ఆరేళ్లలో దాదాపు 5.5 కోట్ల మీల్స్‌ను ఈ క్యాంటీన్లు ద్వారా అందించారు. ముఖ్యంగా పేదలు, అడ్డాల మీద ఉండే కూలీల కొరకు ఈ పథకం ప్రారంభించడం జరిగింది. పేదల ఆకలి తీర్చడానికి ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్బంగా ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ అక్షయపాత్ర ఫౌండేషన్ యాజన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా.. కేటీఆర్ ” తెలంగాణలో పేదల ఆకలి తీర్చడానికి అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించి ఆరేళ్లు అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఆరేళ్ల క్రితం ప్రారంభించాం. దాదాపు 5.5 కోట్ల మీల్స్‌ను ఈ క్యాంటీన్లు అందించాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేని అతిపెద్ద కార్యక్రమం ఇది. అక్షయపాత్రకు, కష్టపడి పనిచేస్తోన్న సిబ్బందికి ధన్యవాదాలు” అని కేటిఆర్ తెలిపారు. కాగా, ఈ క్యాంటీన్లు ప్రతిరోజు వేలాదిమంది ఆకలిని తీరుస్తున్నాయి. హైదరాబాద్‌ పరిధిలో సుమారు 150 అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి. మధ్యాహ్నం, రాత్రి ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం పెడుతున్నారు. అంతేకాదు, కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.