Ongole Breed Cow : బ్రెజిల్‌లోని మినాస్ గెరాస్‌లో ప్రస్తుతం జరుగుతున్న పశు మార్కెట్‌లో నెల్లూరుకు చెందిన ఆవు అత్యధిక ధరకు అమ్ముడైంది. వియాటినా-19 అనే ఈ ఆవు రూ. 40కోట్లకు అమ్ముడు పోయింది. ఈ ఆవు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఒంగోలు బ్రీడ్ కు చెందినదిగా గుర్తించారు. వయాటినా-19 బరువు ఏకంగా 1,101కిలోలు.
అత్యంత విలువైన ఆవు
చూడటానికి వియాటినా-19 ఆవు అందంగా ఉండటమే కాకుండా అనేక ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. ఈ ఆవు “మిస్ సౌత్ అమెరికా” టైటిల్‌ను కూడా గెలుచుకుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆవుకు డిమాండ్ పెరిగింది. అనేక దేశాలు ఈ ఆవు పిల్లలను కొనుగోలు చేసి, ఉత్తమ నాణ్యత గల నెల్లూరు ఆవులను అభివృద్ధి చేయాలని భావించాయి. ఈ నేపథ్యంలో ఈ ఆవుకు వేలం ప్రక్రియ జరుగుతుండగా, ఓ కొనుగోలుదారు రూ. 40 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు.
నెల్లూరు ఆవు ప్రత్యేకతలు
నెల్లూరు జాతిని ఒంగోలు బ్రీడుకు చెందినది అని చెబుతున్నారు ఈ ఆవు అత్యంత ఎక్కువ వేడి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా పెంచవచ్చు. సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల్లో ఇతర ఆవుల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, అయితే నెల్లూరు జాతి ఆవులకు అలాంటి సమస్య ఉండదు. ఇవి తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా జీవించగలవు, దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. వీటి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బలంగా ఉండటంతో, వాటిని పెంచడం చాలా సులభం.
ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే శక్తి
నెల్లూరు జాతి ఆవులకు నిల్వ సామర్థ్యం ఎక్కువ. అందువల్ల అవి ఎక్కువ సమయం పాటు ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. కాబట్టి ఎండలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, ఎప్పుడైనా తక్కువ ఆహారం దొరికినా, ఇవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతుకుతాయి. ఈ లక్షణం వాటిని ఒక ప్రత్యేక ఆవు జాతిగా మార్చింది.
1800 నుంచే బ్రెజిల్‌లో నెల్లూరు గేదెల పెంపకం
బ్రెజిల్‌లో నెల్లూరు ఆవుల పెంపకం 1800 సంవత్సరాల నాటికే ప్రారంభమైంది. నెల్లూరు ఆవుల ఆరోగ్య స్థాయిలు, తక్కువ వ్యయంతో సంరక్షణ, ప్రతికూల వాతావరణంలోనూ బతకగల సామర్థ్యం బ్రెజిల్ రైతులను ఆకర్షించాయి. ఈ జాతి ఆవులకు తక్కువ వైద్య సహాయం అవసరం, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా వీటి డిమాండ్ పెరుగుతోంది. ఈ విశేషమైన లక్షణాల వల్ల నెళ్లూరు జాతి ఆవులకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ఆవు జాతి అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.