Income Tax Raid: ఇన్‌కమ్ ట్యాక్ డిపార్ట్‌మంట్.. ఈ పేరు వింటేనే అక్రమంగా ఆదాయం పొందేవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. చట్టబద్ధమైన ఆదాయాన్ని ఐటీ శాఖ ప్రోత్సహిస్తుంది. కానీ, దేశానికి నష్టం కలిగిస్తూ సంపాదించే సొమ్ముపై మాత్రం ఐటీ కొరడా ఝళిపిస్తుంది. అంతే కాదు. ప్రభత్వుం నుంచి వేతనాలు పొందే ఉద్యోగులు కూడా తమ సొమ్ములో కొంత దేశం కోసం ట్యాక్సు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది పన్ను ఎగవేత కోసం వివిధ మార్గాలు అన్వేషిస్తుంటారు. దేశంలో సరిగ్గా పన్న కట్టేవారిలో ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ. ఇక వ్యాపారా, వాణిజ్య రంగాల్లో ఉన్నవారు తమ ఆదాయం తక్కువగా చూపుతూ కోట్ల రూపాయల పన్ను ఎగవేస్తున్నారు. ఇలాంటివారిపై ఐటీ శాఖ దాడి చేస్తుంది. ఇక రాజకీయ నాయకులు కూడా వ్యాపరం ముసుగులో అక్రమంగా కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటున్నారు. బినామీల పేరుతో వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. కొందరు ఇతర దేశాలకు తరలించి అక్కడి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి వారిపైనా ఐటీ శాఖ దాడులు చేస్తుంది. అయితే రాజ్యాంగబద్ధమైన ఈ సంస్థపై ఇటీవల ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిందని, కేంద్రం ఆదేశాలతోనే దాడులు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న వారు ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. ఐటీ శాఖ ఇప్పటి వరకు అనేక దాడులు నిర్వహించింది. కోట్ల రూపాయలు రికవరీ చేసింది. ఇందులో అతిపెద్ద ఐటీ రైడ్ ఒకటి ఉంది. దేశంలోనే అతిపెద్ద ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ ఎప్పుడు జరిగిందో తెలుసుకుందాం.
గతేడాది అతిపెద్ద ఐటీ రైడ్..
ఈ ఆదాయపు పన్ను శాఖ దాడులు గతేడాది జరిగాయి. ఆదాయపు పన్ను దాడుల్లో రూ.352 కోట్లు రికవరీ చేశారు. ఆ మొత్తాన్ని లెక్కించడానికి పది రోజులు పట్టింది. భారతీయ ఆదాయపు పన్ను 165 సంవత్సరాలను పురస్కరించుకుని ఒక ఫంక్షన్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద ఐటీ రైడ్‌ను నిర్వహించిన ఈ ప్రత్యేక బృందంతో సహా ఇతర బృందాలను కూడా సత్కరించారు. 10 రోజుల పాటు డబ్బును లెక్కించగా మొత్తం 351.8 కోట్ల నగదు బయటపడింది. మొత్తం మూడు డజన్ల కౌంటింగ్ మిషన్లతో ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడిలో డబ్బును లెక్కించేందుకు వివిధ బ్యాంకు యంత్రాలు, సిబ్బందిని ఉపయోగించారు. ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద ఐటీ రైడ్ ఇదే.
ఒడిశా ఎంపీ ఇంట్లో భారీగా నగదు..
ఇక ఈ అతిపెద్ద ఐటీ రైడ్ ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో జరిగింది. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడడంతో ధీరజ్ సాహు ప్రభుత్వానికి 150 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను చెల్లించారు. ఇప్పటి వరకు ఐటీ శాఖ నిర్వహించిన అతిపెద్ద రైడ్, అతిపెద్ద రికవరీ కూడా ఇదే.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Rs 352 crores took 10 days to calculate credit to the team for conducting indias largest income tax raid till date
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com