
అదును చూసి కేసీఆర్ ప్రభుత్వ పథకాలు ప్రకటిస్తారు. ఆయన ప్రకటించిన పథకాలతో ప్రభుత్వానికి నష్టం సంగతి ఎలా ఉన్నా.. రాజకీయంగా మాత్రం ప్రయోజనం ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా కేసీఆర్ దళితుల అభివృద్ధి పేరిట ఓ నూతన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా కడు పేదరికంలో ఉన్న దళితులను అభివృద్ధి చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే ఇతర స్కీంల మాదిరిగా కాకుండా నేరుగా వారికి డబ్బు చేరేలా ప్లాన్ వేస్తున్నారు. అయితే ఈ పథకం ద్వారా కేసీఆర్ రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తున్నాడని కొందరు అంటున్నారు.
ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు. అలా ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు వీటిని అందజేయనున్నారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లనుంది. ఇలా 119 నియోజకవర్గాల్లోని 11900 కుటుంబాలకు అందజేయనున్నారు. దీనికి దళిత ఎంపర్మెంట్ అనే పేరు పెట్టారు. అయితే ప్రతీ నియోజకవర్గంలో వంద మంది కుటుంబాలను ఎంపిక ఎలా చేయాలనన్నది ఆసక్తికంగా మారింది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో వేల కొద్దీ కుటుంబాలు ఆర్థికంగా చితికి ఉన్నారు. వీరిలో కొంతమందిని ఎంపిక చేస్తే మిగతా వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా ఈ 10 లక్షల మొత్తాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందే పంపిణీ చేయనున్నారు. దీంతో హుజూరాబాద్ లో గెలిచేందుకే కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించాని అంటున్నారు. కానీ దళిత అభివృద్ధికి కేసీఆర్ ఎం చేయలేదని ఎన్నో ఏళ్లుగా విమర్శలు వస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పటి వరకు ఆ పథకంపై దృష్టి పెట్టలేదు. దీంతో దళితుల నుంచి విమర్శలు రాకుండా… అటు హుజూరాబాద్ ఉప ఎన్నికలు గెలిచేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అంటున్నారు. అయితే కేసీఆర్ పథకాలు ప్రకటించినా అవి కొనసాగడంలో కొన్ని లోపాలు ఏర్పడుతాయి. మరి ఈ పథకం ఎంతమేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి..