Huzurabad: ఆర్‌ఆర్‌ఆర్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే జక్కన్న, ప్రముఖ దర్శకుడు రాజమౌలి తీస్తున్న త్రిపుల్ ఆర్ గురించి అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. హుజూరాబాద్ ఎన్నికల దృష్ట్యా పొలిటికల్ సర్కిల్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్ ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలేంటో తెలుసుకోవాలనుందా? అయితే స్టోరీలోకి వెళ్లాల్సిందే..

హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నారు. అనేక సభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీలో కేసీఆర్‌కు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. అదేమంటే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూపిస్తామని ప్రచారంలో చెప్పారు. మొదటి ఆర్ అంటే రాజాసింగ్ అని, రెండో ఆర్ అంటే రఘునందన్‌రావు అని, మూడో ఆర్ అంటే రాజేందర్ అని మొత్తంగా అసెంబ్లీలో కేసీఆర్‌కు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూపిస్తామని ప్రచారంలో చెప్తూ వచ్చారు. ప్రచార సరళిలో నాయకులు చెప్పే డైలాగులు ఎన్నికల ఫలితాలప్పుడు ట్రెండ్ అవ్వడం సర్వసాధారణం. ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంతో మీమ్స్ చేసి మరీ ట్రెండింగ్‌లోకి తెస్తుంటారు.
Also Read: Diwali : దివాళీ రోజున బాణసంచా.. తెలుగు రాష్ట్రాల్లో అనుమతి ఉందా??
సరిగ్గా హుజూరాబాద్ ఎన్నికల్లో రౌండ్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మెజారిటీ పెరుగుతుండటంటో సడెన్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ట్రెండింగ్‌లోకి వచ్చింది. బీజేపీ కార్యకర్తలు ఈటల రాజేందర్ గెలుపును సూచిస్తూ ఈ పోస్టర్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. అదిప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Also Read: Huzurabad bypoll results: వీణవంకపైనే టీఆర్ఎస్ బోలెడు ఆశలు.. అక్కడ పోతే హుజూరాబాద్ పోయినట్టే??