Anchor Suma: స్మాల్ స్క్రీన్ క్వీన్ ఇన్ స్టెంట్ పంచ్‌లకు పెట్టింది పేరు అంటే యాంకర్ సుమ అనే చెప్పాలి. సినిమా వేడుక ఏదైనా ఆమె వాయిస్ వినిపించాల్సిందే… ఏ ఛానల్ మార్చినా ఆమె బొమ్మ కనిపించాల్సిందే. సినిమా, టివి జనాలందరికీ సుమ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆమె యాంకరింగ్‌తో వేడుక కళే మారిపోతోంది. వల్గారిటీ ఉండదు అందరితో ఈజీగా కలిసిపోతోంది. ఎదుటివారిని ఇబ్బంది పెట్టదు. బాగా లౌక్యం తెలిసిన మనిషి. దీంతో బుల్లితెర లేడీ సూపర్‌స్టార్‌గా తిరుగులేని హవా ప్రదర్శిస్తోన్న సుమ తర్వలో వెండితెరపైకి అడుగుపెట్టబోతుంది.

ఇప్పటికే ఓ పక్క యాంకర్లుగా రాణిస్తూ సినిమాల్లో నటిస్తోన్న అనసూయ, రష్మీ మాదిరిగా వెండితెర ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతోంది. గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. తాజాగా సుమ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఓ వీడియో ద్వారా సుమ ఈ విషయాన్ని తన స్టైల్లో చెప్పేశారు. పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసి.. ”ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే” అని సుమ పేర్కొన్నారు.
త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వబోతున్నట్లు సుమ వీడియో ద్వారా తెలిపింది. సుమ నటించబోయే ఆ సినిమా ఏంటి? ఫీమేల్ లీడ్ ఉన్న సినిమా చేస్తోందా? లేదా మరో కొత్త తరహా కథను ఎంపిక చేసుకుందా లాంటి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.