https://oktelugu.com/

Nara Lokesh: రూటు మార్చిన లోకేష్ .. పవన్ స్టైల్, బాలయ్య డైలాగ్స్

Nara Lokesh: చిన్నబాబు లోకేష్ రూటు మార్చారు. విమర్శల డోసును పెంచారు. నేరుగా వాగ్భాణాలను సంధిస్తున్నారు. ముఖ కవలికలు, హవభావాలు మార్చి మాట్లాడుతున్నారు. ప్రధాన విపక్షానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అచ్చం సినిమా డైలాగులు పోలినట్టు వ్యాఖ్యానిస్తున్నారు. సరికొత్తగా పిడికిలి బిగించడంతో పాటు యువత అందరితో చేయిస్తున్నారు. సమస్యపై స్పాంటెనిష్ గా స్పందిస్తున్నారు. చిన్నబాబులో వచ్చిన మార్పు చూసి తెలుగుతమ్ముళ్లు తెగ సంబర పడిపోతున్నారు. లోకేష్ రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి రకరకాల వ్యాఖ్యానాలు, […]

Written By:
  • Dharma
  • , Updated On : May 21, 2022 / 09:18 AM IST
    Follow us on

    Nara Lokesh: చిన్నబాబు లోకేష్ రూటు మార్చారు. విమర్శల డోసును పెంచారు. నేరుగా వాగ్భాణాలను సంధిస్తున్నారు. ముఖ కవలికలు, హవభావాలు మార్చి మాట్లాడుతున్నారు. ప్రధాన విపక్షానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అచ్చం సినిమా డైలాగులు పోలినట్టు వ్యాఖ్యానిస్తున్నారు. సరికొత్తగా పిడికిలి బిగించడంతో పాటు యువత అందరితో చేయిస్తున్నారు. సమస్యపై స్పాంటెనిష్ గా స్పందిస్తున్నారు. చిన్నబాబులో వచ్చిన మార్పు చూసి తెలుగుతమ్ముళ్లు తెగ సంబర పడిపోతున్నారు. లోకేష్ రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి రకరకాల వ్యాఖ్యానాలు, ట్రోలింగులు నడిచాయి. ఏ రాజకీయ వారసుడికి లేనంతగా సవాళ్లు ఎదురయ్యాయి.

    Nara Lokesh

    వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ విపక్ష నేతలు విమర్శలు కురిపించారు. నేరుగా ఆరోపణలు సైతం చేశారు. కానీ వాటన్నింటినీ లోకేష్ సద్విమర్శలుగా తీసుకున్నారు. శాసనమండలిలో సైతం కొందరు విపక్ష నేతలు లోకేష్ మాట తీరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ లోకేష్ సంయమనం కోల్పోలేదు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా రాటు దేలుతున్నాడు. తండ్రి చాటు నుంచి బయటపడుతున్నారు. వ్యక్తిగత ఇమేజ్ తో పాటు రాజకీయ పరిణితిని కనబరుచుతున్నారు.

    Also Read: Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో జగన్ సర్కారు సహాయ నిరాకరణ.. చేతులెత్తేసిన సీబీఐ

    తాజాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ పాలనకు ప్రజలు భయపడిపోతున్నారన్నారు. కార్యకర్తలకు కేసులకు భయపడొద్దని నాపై 14 కేసులున్నా ఏం పీకలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇది ట్రైలర్ మాత్రమేనని.. సినిమా తర్వలో ఉందని హెచ్చరిస్తూనే.. మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి మీసం మెలేసీ రోడ్లపై తిరుగుతానంటూ ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు తప్ప ఏమీ లేవన్న నారా లోకేష్.. తనపై పెట్టిన కేసులు ప్లూట్ వాయించినట్టుందని.. ప్లూట్ జింక ముందు ఊదు.. తెలుగు దేశం పార్టీ ముందు కాదు.. బ్లడీ పూల్ అంటూ తన మామ, హీరో బాలక్ళష్ణ డైలాగ్ చెప్పి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

    పదునైన వ్యాఖ్యలు..
    ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని లోకేష్ విమర్శించారు. వైసీపీ కార్యకర్తలపైనా వైసీపీ నాయకులు దాడులకి పాల్పడుతున్నారని, వైసీపీ ఎమ్మెల్సీ ఆయన కారు డ్రైవర్ ని హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని ఆరోపించారు. త్వరలో జరగబోయే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా రాబోతున్నారన్నారు లోకేష్. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు నాయుడు రాముడని కానీ తాను మాత్రం వైసీపీ నాయకుల పాలిట మూర్కుడినని ఘాటుగా విమర్శించారు. దొంగ కేసులకు ‌భయపడేది, పారిపోయేది లేదని తెలిపారు. మరో రెండేళ్లలో మన ప్రభుత్వం రాబోతుందని ఏ ఒక్కరినీ మర్చిపోను వడ్డీతో సహా తీరుస్తా అంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎప్పుడూ వీ సింబల్ చూపిస్తూ అభివాదం చేసే లోకేష్ ఈసారి కాస్త స్టైల్ మార్చారు. పిడికిలి బిగించాలంటూ యువతకు పిలుపునిచ్చి తాను కూడా పిడికిలి బగించి అభివాదం చేశారు. సాధారణంగా అధినేత పవన్ కల్యాణ్ ఇలా పిడికిలి బిగించి అభివాదం చేస్తుంటారు. ఈసారి లోకేష్ పవన్ స్టైల్ ఫాలో అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం అంటేచాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న లోకేష్ మరోసారి అధే పంథాను కొనసాగించారు. గతంలో మాదిరిగా సాఫ్ట్ గా కాకుండా… తన విమర్శల్లో కాస్త మసాలా దట్టిస్తున్నారు. ఈసారి పవన్ స్టైల్ ఫాలో అయి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

    Nara Lokesh

    అన్నింటా మార్పు
    లోకేష్ శరీరాక్రుతిలో కూడా భారీగా మార్పు కనిపిస్తోంది. చిన్నపాటి గెడ్డంతో తండ్రి చంద్రబాబును తలపించేలా కనిపిస్తున్నారు. అయితే లోకేష్ మార్పు వెనుక పెద్ద కసరత్తే జరిగినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకం. చంద్రబాబు శక్తివంచన లేకుండా క్రుషి చేస్తున్నారు. కానీ బలం చాలడం లేదు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ స్లోగన్ పార్టీలో క్రమేపీ పెరుగుతూ వస్తోంది. ఆయనకు పార్టీలోకి ఆహ్వానించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిణితి కనబరచకపోతే చంద్రబాబు వారసత్వం అందుకోలేమన్న బెంగ లోకేష్ ను వెంటాడుతోంది. ఈసారి కానీ టీడీపీ అధికారంలోకి రాకపోతే కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే లోకేష్ ను అన్నివిధాలా సంసిద్ధులను చేస్తున్నారు. అందులో భాగంగానే లోకేష్ లో ఈ మార్పు అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మొత్తానికి గతం కంటే లోకేష్ ప్రకటనలు, వ్యాఖ్యలు హాట్ హాట్ గా ఉండడంతో టీడీపీ శ్రేణుల్లో ఒకరకమైన జోష్ కనిపిస్తోంది.

    Also Read:Pawan Kalyan: స్ట్రేటజీ మార్చిన పవన్.. అన్ని అంశాలపై ఫుల్ క్లారిటీ

    Tags