బొగ్గు తరిగిపోతుంది.. పెట్రోల్ ఆవిరైపోతుంది.. కానీ సహజ వనరులు ఎప్పటికీ అంతం కావు.. సూర్యుడి నుంచి వచ్చే కాంతి అనంతం.. దాన్నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.. మనం వాడుకోవచ్చు. అలాగే బొగ్గు,పెట్రోల్ నుంచి కార్బన్ డై అక్సైడ్ వచ్చి కలుషితం చేస్తుంది.అదే లిక్విడ్ గ్యాస్ నుంచి ఆ సమస్య ఉండదు.. భూమినుంచి వెలికితీసే ఇంధనాల్లో సహజ వాయువు పాత్ర కాదనలేనిది? అందుకే అన్ని దేశాల ప్రభుత్వాలు ఇప్పుడు సహజవాయువుకు పెద్దపీట వేస్తున్నాయి. దేశ పునర్మిర్మాణానికి కాలుష్యం వెదజల్లని సహజవాయువు వాడకం ఎంతో అవశ్యం..
క్లీన్ ఎనర్జీగా పేరొందిన సహజవాయువు.. క్రూడాయిల్, బొగ్గు కంటే కూడా ఎంతో మేలు. దీనివల్ల అస్సలు కాలుష్యం వ్యాపించదు.. ప్రపంచదేశాల ఇంధనం వాడకంలో సహజవాయువు వాటా 24శాతం ఉండగా.. భారతదేశంలో మాత్రం ఇది కేవలం 6.2శాతం గా ఉంది. ఇప్పుడు మోడీ సర్కార్ వచ్చాక దీన్ని 15శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఇంధన వినియోగంలో సహజవాయువు పాత్రపై స్పెషల్ వీడియో..