వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా సొంతపార్టీ నేతలకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటలుపేల్చే రోజా ఇప్పుడు వైసీపీ నేతలకే వార్నింగ్ ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. 2019లో నగరిలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు జగన్ క్యాబినెట్లో మంత్రి పదవీ ఖాయమని ప్రచారం జరిగింది. అయితే క్యాస్ట్ ఈక్వేషన్లలో భాగంగా రోజాకు మంత్రి పదవీ దూరమైంది. దీంతో సీఎం జగన్ పై రోజా అలక చెందడంతో ఆమెకు క్యాబినెట్ హోదా కలిగిన ఏపీఐఐసీ పదవీని కట్టబెట్టారు.
Also Read: పోయేకాలం వచ్చిదంటే ఇదే కాబోలు..!
దీంతో రోజా తనకు కేటాయించిన పదవీ కొనసాగుతూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారు. సీఎం జగన్ సపోర్టు ఆమె పూర్తిగా ఉండటంతో నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో ఆమె ఉనికిని చాటుకుంటున్నారు. అయితే ఇద్దరు మంత్రులు నగరిలో కొద్దిరోజులుగా తనకు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు తనదైన శైలిలో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
Also Read: రాయలసీమపై జగన్ ప్రేమకు మరో తార్కాణం!
తనకు సమాచారం లేకుండా మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నగరిలో పర్యటిస్తుండటంపై రోజా ఫైరవుతున్నారు. తనకు తెలియకుండా మంత్రులు నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులైనా సరే తన నియోజకవర్గంలో వేలుపెడితే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. ముఖ్యంగా మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. రోజా వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ మంత్రులను పిలిచి మాట్లాతారా? లేదా రోజాకే సర్దిచెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.