Roja: వైసీపీలో రోజా అంటే ఫైర్ బ్రాండ్. జగన్ మీద ఈగ వాలినా సరే వెంటనే రియాక్ట్ అయిపోతుంటారు. అవతలి వైపు ఉన్నది ఎవరా అని కూడా చూడకుండా ఏకిపారేస్తుంటారు. కాగా ఆమె ఇప్పుడు చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె యాదాద్రిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే అందరినా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కేసీఆర్ కారణ జన్ముడని, ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే ఎంతో దేవుడి ఆశీస్సులు ఉండాలని, కేసీఆర్‌కు అవి పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆలయం చాలా అద్భుతంగా కట్టారంటూ ఆమె చెప్పడం ఇక్కడ విశేషం. కాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నడుమ పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. ఏపీతో నీళ్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. అందుకే కేసీఆర్‌కు, జగన్‌కు మధ్య గ్యాప్ వచ్చిందని చెబుతుంటారు.
Also Read: ప్రభాస్ ఇంతలా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వలేదు !
ఈ మధ్య అసలు కేసీఆర్ మీద సానుకూలంగా మాట్లాడిన వైసీపీ నేతలు ఎవరూ లేరు. జగన్ ఆదేశం లేకుండా ఎవరు కూడా అలాంటి కామెంట్లు చేయరు. కానీ రోజా ఇలాంటి కామెంట్లు చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి ఉండాలంటూ చెప్పడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇది రాజకీయమా లేక కేవలం గుడి వరకే అన్నట్టు మాట్లాడారా అనే చర్చ సాగుతోంది.

ప్రస్తుతం ఆమెకు వైసీపీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆమె కేసీఆర్ మీద ప్రశంసలు కురిపించడం వెనక జగన్ ఉన్నాడా అనే అనుమానాలు కూడా కలిగిస్తున్నాయి. పైగా రెండు రాష్ట్రాల ప్రజలు అన్న దమ్ముల్లాగా కలిసి మెలిసి ఉండాలని చెప్పడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే తెలంగాణతో మళ్లీ సత్సంబంధాలను ఏపీ కోరుకుంటోందా అనే అనుమానాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఆలయాన్ని దర్వించుకోవడానికి వస్తే.. కేసీఆర్ మీద అంతలా ప్రశంసలు కురిపించాల్సిన అవసరం లేదు కదా. దర్శించుకుని సైలెట్ వెళ్లిపోకుండా.. కేసీఆర్ మీద కామెట్లు చేయడం ఏంటనే అనుమానాలు లేకపోలేదు.
Also Read: సన్ రైజర్స్ తీరుతో అభిమానుల్లో ఆగ్రహం? సోషల్ మీడియాలో విమర్శలు
[…] BJP: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టింది. ఇటీవల తెలంగాణ ఏర్పాటు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పిన మాటలను టీఆర్ఎస్ నాయకులు తప్పుబడుతూ బీజేపీని నిందించిన నేపథ్యంలో వారిని ఇరుకున పెట్టేందుకు ఓ కొత్త ప్రణాళిక రచించింది. టీఆర్ఎస్ ను సైతం ఇరుకున డేసే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుకు సంకల్పించింది. దీనికి గాను కార్యాచరణ ప్రణాళికకు ముందుకొచ్చింది. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చి తాము కూడా విభజనకు వ్యతిరేకం కాదని చాటిచెప్పేందుకు నిర్ణయించుకుంది. దీంతో టీఆర్ఎస్‌ను సైతం నడిబజార్లో నిలబెట్టి కడిగేయాలని భావించినట్లు కనిపిస్తోంది. […]