Mahira Khan: పాకిస్తాన్ నటి మహిరా ఖాన్ పై ఓ నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘నువ్వో పాకిస్తానీ బిచ్చగత్తె. ముందు నీ దేశం మీద ఫోకస్ పెట్టు’ అని కామెంట్ చేశాడు. దీనికి మహిరా స్పందిస్తూ.. ‘నువ్వేంటి మరి నా మీద ఫోకస్ చేస్తున్నావ్’ అని కౌంటరిచ్చింది. ఈమె 2017లో రయీస్ సినిమాలో షారుక్ సరసన నటించింది. ఆ తర్వాత భారత్‌లో పాక్ నటులపై నిషేధం విధించడంతో మరే సినిమాలోనూ నటించలేదు. అయినా తనను ఇలా ఇండియాలో టార్గెట్ చేయడం పై ఈ నటి బాగా ఫీల్ అవుతుంది.

ఈ క్రమంలో మీడియాలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.
ఇంతకీ ఈ పాకిస్తాన్ నటి మహిరా ఖాన్ మాట్లాడింది ఏమిటంటే.. ఆమె మాటల్లోనే.. ‘ఇండియాలోని ప్రజలు నా పై ఎప్పుడూ విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని చూపించింది నిజం. అలాగే మొదట్లో నన్ను మీడియా కూడా బాగా ప్రమోట్ చేసింది. అందుకే నాకు నేటికి హిందీ మీడియాలో మంచి సన్నిహితులు ఉన్నారు. వారి నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను.
Also Read: అరుదైన సినీ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు !
అయితే, మీకు తెలుసు.. నేను ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో నటించడం లేదు. అలాగే నేను కొన్ని కఠినమైన పరిస్థితులలో ఉన్నాను. కానీ అవి ఎక్కువ కాలం ఉండవు. కాబట్టి.. నా గోప్యత, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా ఎవ్వరూ కామెంట్స్ చేయకండి. అయినా.. ఒక మహిళకు ఇండియాలో గౌరవం ఉంటుంది అని నా నమ్మకం. కొంతమంది ఆ నమ్మకాన్ని పోగొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వాళ్ళు ఎంతలా ప్రయత్నం చేసినా నేను వాటి మాయలో పడను. అయితే… నేను మీడియా మిత్రులను కూడా నా తరుపున అభ్యర్థిస్తున్నాను. మీరు మీ సొంత వాళ్ళ విషయంలో ఎంతలా ప్రేమ కనబరుస్తూ జాగ్రత్తలు తీసుకుంటారో.. నా విషయంలోనూ అలాగే ఉండండి. అలాగే జాగ్రత్తలు తీసుకోండి. మంచి చేస్తే.. మీకు మంచి జరుగుతుంది’ అంటూ ఈ పాకిస్థానీ నటి చెప్పుకొచ్చింది.

మొత్తానికి పాకిస్థాన్ నుంచి వచ్చి నటిగా బాలీవుడ్ లో ఎదిగే ప్రయత్నం చేసినా ఈ బ్యూటీ ఆశలు చివరకు ఆశగానే మిగిలిపోయాయి. నిజానికి నటిగా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకోవడం కంటే కూడా.. బోల్డ్ పాత్రలలో నటించి.. ఇండియాలో సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేసుకుంది. కానీ ఆ ప్లాన్స్ వర్కౌట్ కాలేదు.
Also Read: సన్ రైజర్స్ తీరుతో అభిమానుల్లో ఆగ్రహం? సోషల్ మీడియాలో విమర్శలు