Kandahar Hijack IC814 : కాందహార్ విమానం హైజాక్ కు గురైన సంఘటనలో మరో సంచలనాత్మక విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఒకవేళ అతడు గనుక హైకార్లకు చిక్కి ఉంటే ఈ వ్యవహారం మరో మలుపు తీసుకునేది.. ఆరోజు విమానం హైజాక్ అయిన సమయంలో అందులో ప్రపంచ దేశాలు కరెన్సీ ముద్రణ కోసం వినియోగించే సామగ్రి సరఫరా చేసే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. అయితే అతడి గురించి బయట ప్రపంచానికి తెలియకపోవడం, ముఖ్యంగా హైజాకర్లకు తెలియకపోవడంతో బతికి బయటపడ్డాడు. లేకుంటే ఆకుబేరుడు ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు. నేపాల్ రాజధాని ఖాట్మాండ్ నుంచి 1999 డిసెంబర్ 24న అభిమానం బయలుదేరింది. కొంతసేపటికి అపహరణకు గురైంది. ఆ అభిమానంలో రాబర్టో గియోరి అనే కుబేరుడు కూడా ఉన్నాడు. ఒకవేళ అతడిని హైజాకర్లు పట్టుకొని ఉంటే ప్రపంచం మొత్తం స్తంభించిపోయేది. ఏకంగా 70 దేశాలు అల్లకల్లోలం అయ్యేవి.. రాబర్టో స్విస్ – ఇటాలియన్ వ్యాపారవేత్త. అతడు యునైటెడ్ కింగ్డమ్ లో డె లా ర్యూ( De La Rue) అనే పేరుతో ఓ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీ ప్రపంచంలో 70 దేశాలు తమ కరెన్సీ ముద్రణకు వినియోగించే కీలకమైన సామగ్రిని అందిస్తుంది.. ఆ దేశాలు తమ కరెన్సీకి ఉపయోగించే నోట్లను రాబర్టో కంపెనీలోనే ప్రింట్ చేసేవారు. రాబర్టో స్విట్జర్లాండ్ దేశంలో అతిపెద్ద శ్రీమంతులలో ఒకడు..
హాలిడే వెకేషన్ ముగించుకొని వస్తుండగా..
1999 డిసెంబర్ లో రాబర్టో తన భార్య క్రిస్టినా కలాబ్రేసి తో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. కాట్మండు ప్రాంతంలో అందమైన ప్రదేశాలను చూసి ఆ దంపతులు తిరిగి వస్తున్నారు. వారు ఐసి 814 విమానంలో తమ దేశానికి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ దేశానికి చెందిన ఉగ్రవాదులు అ విమానాన్ని హైజాక్ చేశారు. ఆ తర్వాత తమ డిమాండ్లను ఆమోదించాలని భారతదేశంపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఇందుకు రాబర్టో కూడా ఒక కారణం. నాటి రోజుల్లో రాబర్టో కోసం స్విట్జర్లాండ్ దేశం ప్రత్యేకంగా ఒక బృందాన్ని కాందహార్ పంపింది. భారత్ తమ డిమాండ్లను ఆమోదించాలని ఒత్తిడి తీసుకొచ్చిన హైజాకర్లు.. 200 మిలియన్ డాలర్లు నగదును కూడా ఇవ్వాలని డిమాండ్ తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో వారి వద్ద ఉన్న బందీలలో రాబర్టో ఉన్నాడనే విషయం వారికి తెలియదు. అయితే ఇదే విషయాన్ని 2000 సంవత్సరంలో టైమ్స్ పత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది..
ఆ కంపెనీ పై ఎన్నో ఆరోపణలు
ఇక డె లా ర్యూ కంపెనీ అత్యంత రహస్యమైన థ్రెడ్, సెక్యూరిటీ హోలోగ్రామ్ ప్రింట్ చేస్తుంది. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ బ్యాంకులకు రవాణా చేస్తుంది. 2016 వరకు ఈ సంస్థ భారతదేశానికి కూడా సరఫరా చేసేది. ఆ సంవత్సరం పనామా లీక్స్ లో డె లా ర్యూ కంపెనీకి సంబంధించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో నోట్ల కాంట్రాక్టు దక్కించుకునేందుకు ఇక్కడ ఒక కీలక అధికారికి కమీషన్ చెల్లించినట్టు పనామా లిక్స్ లో వార్తలు వచ్చాయి.. ఇక 2010లో డె లా ర్యూ సంస్థ భారతదేశానికి పంపించిన సామగ్రిలో లోపాలు బయటపడ్డాయి.. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది.. మరోవైపు డె లా ర్యూ ఉద్యోగులు రిజర్వ్ బ్యాంక్ కు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన విషయం వెలుగు చూసింది. ఇదే విషయాన్ని బ్రిటన్ దేశానికి చెందిన పలు ఏజెన్సీలో భారతదేశానికి తెలియజేశాయి.. అనంతరం భారత ప్రభుత్వం ఈ సంస్థను నిషేధిత జాబితాలో పెట్టింది.. సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చేందుకు 2011లో భారత హోంశాఖ ఈ సంస్థకు నో చెప్పింది.. అయితే 2012లో అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ డె లా ర్యూ కంపెనీ వద్ద భారీగా లంచాలు తీసుకొని.. సెక్యూరిటీ థ్రెడ్స్ కొనుగోలుకు పచ్చ జెండా ఊపారు. అంతేకాకుండా ఎటువంటి టెండర్ నిర్వహించకుండానే ఆమోదముద్రవేశారు.. ఇక ఈ వ్యవహారంపై 2017లో సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టి. మాయారామ్ ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని గుర్తించింది. అతడిపై కేసు నమోదు చేసింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More