RJD Party : ఇక ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ హడావిడి సృష్టిస్తున్నారు. ఇక అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఆర్జేడి ఉంది. ఆర్జెడి చీఫ్ గా లాలూ ప్రసాద్ యాదవ్ కొనసాగుతున్నారు. గతంలో ఆర్జెడి , నితీష్ కుమార్ పార్టీలు కూటమిగా ఏర్పడి బీహార్ రాష్ట్రాన్ని పరిపాలించాయి. ఆ సమయంలో లాలు ప్రసాద్ యాదవ్ మరో కుమారుడు తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆ కూటమికి బీటలు వారడంతో అనూహ్యంగా బిజెపి లైన్లోకి వచ్చింది. నితీష్ కుమార్, బిజెపి కూటమిగా ఏర్పడి బీహార్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. త్వరలో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో అక్కడ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు..
Also Read : కోవిడ్ పునరాగమన ప్రచారం.. కొత్త వేరియంట్ల పేరుతో మెడికల్ మాఫియా కుట్ర?
ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జెడిలో ముసలం ఏర్పడింది. ఆర్జెడి సుప్రీమ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇటీవల చేయకూడని పనిచేశాడు. ఓ యువతితో బహిరంగంగా రాయడానికి వీలు లేని పనిచేశాడు. పైగా ఆ వ్యవహారాన్ని అతడు తన తన ఫోన్లో రికార్డు చేశాడు. దానికి సంబంధించిన వీడియో మీడియా ద్వారా బయటపడింది. తద్వారా లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం పరువు బజారున పడింది. ఈ ఉదంతం ఆర్ జె డి కి కోలుకోలేని దెబ్బలాగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్జెడి అధినేత వెంటనే స్పందించారు.. తేజ్ ప్రతాప్ తన కుటుంబాన్ని నుంచి బహిష్కరిస్తున్నట్టు.. పార్టీ నుంచి కూడా ఆరు సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ కు గతంలోనే ఐశ్వర్య అనే మహిళతో వివాహం జరిగింది. అయితే విభేదాల వల్ల కొద్దిరోజులుగా వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ యువతీతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతోనే జీవనం కొనసాగిస్తున్నాడు. దానిని అంతటితోనే ఆపకుండా అంతకుమించి అనేలాగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఆమెతో బహిరంగంగానే చనువుగా ఉంటున్నాడు.. వాటి వీడియోలను సన్నిహితులకు షేర్ చేస్తున్నాడు. అవికాస్త సోషల్ మీడియాలో పడి ట్రెండ్ అవుతున్నాయి.. ఇటీవల ఆ యువతి తో తేజ్ ప్రతాప్ యాదవ్ చనువుగా ఉన్న ఒక వీడియో బయటికి రావడంతో ఆర్జెడి సుప్రీం తన పరువు పోయినట్టు భావించారు . దానిని నితీష్ కుమార్ పార్టీ తెగ ట్రోల్ చేస్తోంది. ఎన్నికల ముందు ఇలాంటి వ్యవహారం బయటకు రావడంతో పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని భావించిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి వెంటనే తక్షణ చర్యలు తీసుకున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ను కుటుంబం నుంచి బహిష్కరించారు. పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు సస్పెండ్ చేశారు.